Trending

6/trending/recent

బదిలీలు క్రమబద్దీకరణ పై గుంటూరు డిఈవో వారి ప్రకటన

  పత్రికా ప్రకటన

శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్య, అమరావతి వారు బదిలీలు, పోస్ట్‌ల సర్దుబాటు మరియు పదోన్నతుల షెడ్యూలు మరియు సూచనలు ప్రకటించినారు. ఈ సందర్భముగా జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు వారు శ్రీమతి ఆర్‌.ఎస్‌.గంగా భవాని గారు జిల్లాలొని అందరూ ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు షెడ్యూలు మరియు సూచనలుప్రకారము నిర్జీత ప్రొఫార్మాలలో అన్నీ రకాల ఖాళీలను మరియు తప్పనిసరిగా బదిలీ అగు ఉపాధ్యాయ వివరములను సేకరించవలెనని కోరినారు. ఇందుకోసం వారు విషయ పరిజ్ఞానము ఉన్న వారితో కమిటీలను ఏర్పరచుకొని సమాచారమును పరిశీలించి మరియు ధృవీకరించి ఈ కార్యాలయమునకు సమర్చించవలసినదిగా కోరినారు.

పోస్టుల సర్ధుబాటుకు ది.29-2-2020నాటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా తీసుకొనడమైనది. ఈ విషయంలో ది.]4-10-2020 నాటికి విద్యార్ధుల సంఖ్యలో ఏమైనా పెరుగదల ఉన్నచో సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారి తనిఖీ అధికారులద్వారా వివరములు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు ది.19-10-2020 లోపు సమర్ప్చించవలెనని తెల్పినారు.

పేరెంట్‌ మేనేజ్‌ మెంట్‌ లోకి బదిలీలు కోరుకొనే ఉపాద్యాయులు కూడా సంబంధిత తనిఖీ అధికారులద్వారా వివరములను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్ప్చించవలెనని తెల్పినారు.

గమనిక: ఈ ప్రకటనను అని రూరల్‌ ఎడిషన్లనందు ప్రచురించవలసినదిగా కోరడమైనది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad