Trending

6/trending/recent

NMMS Adhar Seeding Press Note 18.03.2024

పత్రికా ప్రకటన, Dt: 18-03-2024

NMMS Adhar Seeding Press Note 18.03.2024

2019, 2020, 2021, 2022 సంవత్సరాలలో నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక కాబడి ఈ సంవత్సరం 9, 10, 11, 12 తరగతులు చదువుతూ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో నమోదు/రెన్యువల్ చేసుకున్న ప్రతి విద్యార్థి తప్పకుండా తమ బ్యాంక్ అకౌంటు కు ఆధార్ సీడింగ్ చేయించుకొనవలెను. లేని యెడల స్కాలర్షిప్ జమ కాదు. విద్యార్ధి తమ మెరిట్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్ బుక్ తీసుకుని సంబంధిత బ్యాంక్ కు వెళ్ళి ఆధార్ సీడ్ చేయమని అడిగి చేయించుకొనవలెను. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నేరుగా విద్యార్ధి ఆధార్ కు సీడ్ అయిన బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో స్కాలర్షిప్ జమ చేస్తారు గనుక ఆధార్ సీడ్ కాని విద్యార్థులకు స్కాలర్షిప్ జమకాదు. స్కాలర్షిప్ యొక్క స్టేటస్ విద్యార్ధి లాగిన్ లో మాత్రమే తెలుస్తుంది కావున విద్యార్థి లాగిన్ తరచుగా తనిఖీ చేసుకొనవలెను. ఈ విషయమై విద్యార్థి తల్లితండ్రులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకొనవలసినదిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad