Trending

6/trending/recent

Elections: పాఠశాలల్లో Model Code of Conduct MCC అమలుకు మార్గదర్శకాలు జారీ

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వము - పంచాయితీరాజ్ శాఖ

జిల్లా ప్రజా పరిషత్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు - 534008

5.0.0: L1VGE/993/2024-2

సర్క్యులరు

ชื่อ: 12.03.2024

Elections: పాఠశాలల్లో Model Code of Conduct MCC అమలుకు మార్గదర్శకాలు జారీ

విషయము: సాధారణ ఎన్నికలు,2024 - ఏలూరు జిల్లా ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరము 'మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్' (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలులోకి వచ్చుట - MCC అమలుపరుచుటకు మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా పాటించవలసిన సూచనలు జారీ చేయుట గురించి.

సూచిక:1. 205 55 45 0 30 . 0.464/INST/EPS/2022, อือ.02.11.2022.

2. జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టరు, ఏలూరు జిల్లా వారి ఉత్తర్వులు, 82.0.30.47314/2023/H3, อ๋อ: 07.02.2024.

పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు సాధారణ ఎన్నికలు నిర్వహించుటకు సన్నాహక కార్యక్రమములలో భాగం గా ఎన్నికల సమయంలో చేపట్టాల్సిన వివిధ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర నోడల్ అధికారిని మరియు జిల్లా స్థాయిలో జిల్లా నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ వారు పై 1వ సూచిక ద్వారా ఆదేశములు జారీ చేసియున్నారు.

సదరు ఆదేశముల ననుసరించి, ముఖ్య నిర్వహణాధికారి జిల్లా ప్రజా పరిషత్ వారిని మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలుకు సంబంధించి జిల్లా నోడల్ అధికారిగా నియమించుచూ శ్రీయుత జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టరు, ఏలూరు జిల్లా వారు పై 2వ సూచిక లోని ఉత్తర్వులు జారీ చేసియున్నారు.

మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలుకు సంబంధించి ఎన్నికల కమీషన్ వారు ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారము కోడ్ ఉల్లంఘన కాకుండా ఉండుటకు అవసరమైన ఈ దిగువ సూచనలను పేర్కొనడమైనది.

(1) ECI వారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి MCC అమల్లోకి వస్తుంది మరియు ఎన్నికల ఫలితాలను ప్రకటించిన అనంతరం నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయువరకు ఇది అమలులో ఉండును.

(2) MCC యొక్క సాధారణ నిబంధనలు ఎన్నికలలో అభ్యర్థిగా ఉండాలనుకునే వారితో సహా అందరు వ్యక్తులకు వర్తిస్తాయి.

(3) అధికారిక వాహనాలేవీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు.

(4) ఇతర పార్టీలను మరియు అభ్యర్థులను ఆటంకపరిచే విధంగా మరియు ఓటర్ల మనస్సులపై తీవ్ర ప్రభావం చూపు రాజకీయ నాయకుల ఛాయాచిత్రాలను పాఠశాలల భవనాలు, ప్రాంగణాల్లో ప్రదర్శించకూడదు.

(5) ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు ప్రదర్శించకూడదు.

(6) జాతీయ నాయకులు, కవులు మరియు గతంలోని ప్రముఖ చారిత్రక వ్యక్తులు, రాష్ట్రపతి, గవర్నర్ల చిత్రాలకు సంబంధిం ఈ సూచన వర్తించదు.

(7) పాఠశాలలకు సంబంధించిన భవనాలను మరియు ప్రాంగణాలను పార్టీలు మరియు అభ్యర్థులు ఏదైనా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదు.

(8) అన్ని పాఠశాలలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా వుండవలెను.

(9) MCC అమలుకు ప్రణాళికా బద్దంగా చేయవలసిన కార్యకలాపాల జాబితాను తయారుచేసుకొనవలయును.

(10) పాఠశాలల యందు ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి, మంత్రుల ఫోటోల తొలగింపు లేక ముసుగ వేయుట చేయవలెను.

(11) వివిధ ప్రభుత్వ పధకముల వివరములు తెలియచేయుచూ ఏర్పాటు చేసిన గోడ పత్రికలు/పైంటింగ్ ల పై, స్కూలు బ్యాగ్ లు మరియు పుస్తకాల పై ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఉన్నచో అవి కనపడకుండా జాగ్రత్త వహించి ముసుగు వేయవలెను.

(12) పాఠశాల కార్యాలయం మరియు ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఆస్తులపై గల వాల్ రైటింగ్, పోస్టర్లు/పేపర్లు లేదా మరేదైనా ఇతర రూపంలో గల కటౌట్/హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు మొదలైన వాటిని ECI వారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 24 గంటల్లోగా తొలగించాలి.

(13) ప్రధానోపాధ్యాయులందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వివరములను వారి, వారి పరిధిలోని ఉపాధ్యాయ/ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ తెలియచేసి ప్రవర్తనా నియమావళి అమలు కు చర్యలు తీసుకొనవలయును.

(14) ప్రధానోపాధ్యాయులకు MCC అమలుకు సంబంధించి ఏమైనా సందేహములున్నచో వారి, వారి మండల పరిషత్ అభివృద్ధి అధికారులను సంప్రదించవలెను.

పైన తెలిపిన సూచనలను విధిగా పాటించి ఏలూరు జిల్లా నందలి అన్ని మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) సక్రమముగా అమలు జరిపి, సాధారణ ఎన్నికలు-2024 ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించుటలో భాగస్వామ్యులు కావలసినదిగా అందరు ప్రధానోపాధ్యాయులను కోరడమైనది.

ముఖ్యకార్యనిర్వహణాధికారి, 12 జిల్లా ప్రజా పరిషత్, ప .గో.జిల్లా, ఏలూరు & జిల్లా నోడల్ అధికారి, MCC, ఏలూరు జిల్లా.

To,

ఏలూరు జిల్లా లోని అందరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధిత ఉప విద్యశాఖాధికారుల వారి ద్వారా.

ఏలూరు జిల్లా లోని అందరు మండల ప్రజా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధిత మండల విద్యశాఖాధికారుల వారి ద్వారా.

ప్రతి: ఏలూరు జిల్లా లోని అందరు ఉప విద్యశాఖాధికారులు మరియు మండల విద్యశాఖాధికారులకు తగు చర్య నిమిత్తం.

ప్రతి: జిల్లా విద్యశాఖాధికారి, ఏలూరు జిల్లా, ఏలూరు వారికి సమాచారం నిమిత్తం.

ప్రతి: శ్రీయుత జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టరు ఏలూరు జిల్లా వారికి సమాచారం నిమిత్తం సమర్పించడమైనది.

Download Orders Click Here

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad