Trending

6/trending/recent

AP Election Schedule: ఎన్నికల షెడ్యూల్ ఖరారు - ఢిల్లీ కీలక అప్డేట్..!?

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్ల పైన వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. వచ్చే వారం 13, 14 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడు దశల్లో ఎన్నికలు జరనున్నాయి.

AP Election Schedule: ఎన్నికల షెడ్యూల్ ఖరారు - ఢిల్లీ కీలక అప్డేట్..!?

ఎన్నికల షెడ్యూల్ : ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడదులకు తుది ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13, 14 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగానికి సంకేతాలు అందుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు అలర్ట్ అవుతున్నారు. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల సమయంలో మార్చి 10న షెడ్యూల్ రాగా, ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి అదే విధంగా ఈ నెల 13, 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల చేస్తే.. ఏప్రిల్ 15-20 మధ్యన పోలింగ్ ఉండనుంది. మే చివరి వారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పార్టీలు సమాయత్తం : దేశంలోని సార్వత్రిక, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లు సమీక్షిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సమీక్షలు నిర్వహించింది. స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించి ఏప్రిల్ ద్వితీయార్ధం లో పోలింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈసారి లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు జమ్ము కశ్మీర్‌‌లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad