Saturday, July 27, 2024
AP Rains: కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

AP Rains: కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు.!

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 నవంబర్ 25 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి అదే పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది.

AP Rains: కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు.!

నవంబర్ 25 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి అదే పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయుగుండంగా బలపడుతుందంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు/ ఆగ్నేయ గాలులు వీస్తాయి. రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురువనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.

రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ————————————————- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:- ————————————————–

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

———————- దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:- ——————-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles