Trending

6/trending/recent

Teacher Jobs: టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

Teacher Jobs | టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 8,000 పైగా పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉంది.

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి శుభవార్త. ఇటీవల టీచర్, లెక్చరర్ పోస్టులభర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో (EMRS) 10,391 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తాజాగా ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారన్న స్పష్టత లేదు. అయితే గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లను గమనిస్తే ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,000 పైగా పోస్టులు ఉంటాయని అంచనా. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రైమరీ ట్రైన్డ్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2023 సెప్టెంబర్ 10 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

AWES Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 2023 జూలై 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 సెప్టెంబర్ 10 సాయంత్రం 6 గంటలు

అడ్మిట్ కార్డుల విడుదల- 2023 సెప్టెంబర్ 20

పరీక్ష తేదీ- 2023 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1

ఫలితాల విడుదల- 2023 అక్టోబర్ 23

ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

AWES Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ పాస్ కావాలి. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ పాస్ కావాలి. పీఆర్‌టీ పోస్టులకు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి.

వయస్సు- ఫ్రెషర్‌కు 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులకు 57 ఏళ్ల లోపు.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ. AWES నిర్వహించే ఎగ్జామ్ పూర్తైన తర్వాత దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, ఖాళీల వివరాలతో స్థానికంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. AWES ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad