Trending

6/trending/recent

Crime news: పరువు పోగొట్టుకున్న ప్రభుత్వ టీచర్‌ .. ఛీ ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

Crime news: విద్యాబుద్దులు నెర్పించాల్సిన బాధ్యతాయుతమైన హోదాలో ఉండి..నేరాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిన్నటి వరకు అతని నిజ స్వరూపం తెలియని స్థానికులు, పోలీసులు చోర ముసుగులో ఉన్న వ్యక్తి ఉపాధ్యాయుడని తెలిసి షాక్ అయ్యారు.

Crime news: పరువు పోగొట్టుకున్న ప్రభుత్వ టీచర్‌ .. ఛీ ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

Crime news: పరువు పోగొట్టుకున్న ప్రభుత్వ టీచర్‌ .. ఛీ ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

ప్రభుత్వ ఉద్యోగం..సమాజంలో గౌరవప్రదమైన హోదా కలిగిన వ్యక్తి బుద్ధి పక్కదార్లు తొక్కింది. నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దమని ప్రభుత్వం జీతం ఇస్తుంటే ..దర్జాగా ఉద్యోగం చేసుకోవాల్సిన వ్యక్తి ఈజీ మనీ కోసం తప్పుడు పని చేశాడు. విద్యాబుద్దులు నెర్పించాల్సిన బాధ్యతాయుతమైన హోదాలో ఉండి..నేరాలు చేస్తూ పోలీసు(Police)లకు అడ్డంగా దొరికిపోయాడు. నిన్నటి వరకు అతని నిజ స్వరూపం తెలియని స్థానికులు, పోలీసులు (Police)చోర ముసుగులో ఉన్న వ్యక్తి ఉపాధ్యాయుడని తెలిసి షాక్ అయ్యారు. సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో జరిగిన ఈసంఘటన ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం మూడు పదిహేను నిమిషాలకు కోన్యాల రాములు అనే వ్యక్తి ఎస్బిఐ బ్యాంక్ సంగారెడ్డి మెయిన్ బ్రాంచ్ లో డబ్బులు డ్రా చేసుకున్నాడు. తన భార్యతో కలిసి మోటార్ సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న మార్గంలో మధ్యలో బైపాస్ ఎస్‌బీఐ పోతిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డు పక్కన మోటార్ సైకిల్ ఆపి కూరగాయలు కొరకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్‌పై వచ్చి రాములు చేతిలో ఉన్న క్యాష్‌ బ్యాగును లాక్కెళ్లిపోయాడు. డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు రాములు అదే రోజు సాయంత్రం సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లక్షన్నర కోసం దొంగతనం..

రాముల దగ్గర నుంచి లక్ష యాభై వేల రూపాయలు గల సంచిని దొంగలించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. రాములు చేతిలోంచి లక్షన్నర క్యాష్‌తో ఉన్న సంచిని బైక్‌పై వచ్చి లాక్కెళ్లిన వ్యక్తిని గుర్తించారు. చోరీ చేసిన వ్యక్తి అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. నగదు చోరీ చేసింది ప్రభుత్వ ఉపాధ్యాయుడు సార సంతోష్‌కుమార్ అని తెలిసి షాక్ అయ్యారు. నిదానంగా అతనితోనే నిజాన్ని కక్కించారు పోలీసులు.

టీచర్ క్రైమ్‌ ప్రొఫైల్..

స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు సంతోష్‌కుమార్ ఈవిధంగా దొంగతనాలకు పాల్పడటంపై పోలీసులు ఆరా తీయగా అతని నేరాల చిట్టా బయటపడింది. జల్సాలకు అలవాటుపడి ఇదే విధంగా బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర డబ్బులు డ్రా చేసుకొని తీసుకెళ్లే వాళ్లను టార్గెట్‌గా చేసుకొని చోరీలు చేస్తున్నట్లుగా రాబట్టారు.అంతే కాదు గతంలో తన సహ ఉద్యోగినిగా పని చేస్తున్న ఉపాధ్యాయురాలిపై లైంగికంగా వేధించినట్లుగా కూడా ఫిర్యాదు అందడంతో పోలీసులు గతంలో కూడా సంతోష్‌పై కేసు నమోదు చేశారు. అందరితో సార్ అనిపించుకోవాల్సిన వ్యక్తి సీరియల్ దొంగగా మారడంతో కేసులు విచారిస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad