Saturday, July 27, 2024
PM SHRI SHEME Selected Schools by...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

PM SHRI SHEME Selected Schools by DISE Code , Registration Process and Scheme Details

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఎంపికైన వాటికి కేంద్ర సహకారం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్య (హై క్వాలిటీ ఎడ్యుకేషన్) అందించేందుకు కేంద్రం కొత్తగా పీఎం శ్రీ పథకం ప్రవేశపెట్టింది.

 దీనికింద రాష్ట్రం లో 13455 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. యూడైస్‌ 2021-22 విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని వీటి ఎంపిక జరిగింది. జిల్లాస్థాయిలో ఈ పథకానికి నోడల్‌ అధికారిగా డీఈవో వ్యవహరిస్తారు.

PM SHRI SHEME Selected Schools by DISE Code , Registration Process and Scheme Details

Search Your School by DISE Code Click Here

PM SHRI SHEME Selected Schools by DISE Code , Registration Process and Scheme Details

ఇవీ ప్రయోజనాలు

పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తుంది. డిజిటల్‌ పద్ధతిలో బోధన, ప్రయోగశాలలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు. ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తారు. అయిదేళ్ల వరకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందుతుంది. హెచ్‌ఎంలు తక్షణం చేయాల్సిన పనులపై శనివారం జిల్లా విద్యాశాఖాధికారులకు వెబ్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. తొలిదశ( స్టెప్‌-1)లో పాఠశాలలను రిజిస్ట్రేషన్‌ చేయాలి. రెండో దశలో పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ప్రధానోపాధ్యాయుని లాగిన్‌లో పీఎం శ్రీ పోర్టల్‌ను నమోదు చేసిన వెంటనే ఫోన్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్‌ అయిన తరువాత అందులో పేర్కొన్న 42 అంశాలను పూర్తిచేయాలి. వీటితోపాటు హెచ్‌ఎం, పంచాయతీ కార్యదర్శి విద్యార్హత పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. తరువాత కేంద్ర విద్యాశాఖ ఆయా పాఠశాలలకు మార్కులు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని బడులకు 60 శాతం, పట్టణాల్లో ఉన్నవాటికి 70 శాతం మార్కులు వస్తే ఈ పథకానికి అర్హత పొందుతాయి. రిజస్ట్రేషన్‌ ప్రక్రియను ఈనెల 18 లోపు పూర్తిచేయాలని ఉన్నతాధికారులు అదేశించారు.

కార్పొరేట్‌ తరహాలో విద్య

ఈ పథకం ద్వారా కొన్ని పాఠశాలల్లో కార్పొరేట్‌ తరహాలో అన్ని సౌకర్యాలతో విద్య అందుబాటులోకి వస్తుంది. యూడైస్‌ ప్రకారం 13455 పాఠశాలల ఎంపిక జరిగింది. వాటిలో ఎన్నింటిలో పథకం అమలు జరుగుతుందనేది త్వరలో తెలుస్తుంది.

PM Shri Scheme Details

ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 వ తేదీన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు PM SHRI   (PM Schools for Raising India)  స్కూల్ లను ప్రారంభించడం జరిగింది  . దీనిలో భాగంగా మన అన్ని జిల్లాల్లో 13455 స్కూల్ లను PM SHRI SCHOOL లాగ మార్పు చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం:-

 PM SHRI SCHOOL గా సెలెక్ట్ అయిన స్కూల్స్  ప్రిన్సిపాల్/హెడ్ మాస్టర్స్/హెడ్ టీచర్స్  PM SHRI వెబ్సైట్ లోకి వెళ్లి Udise కు రిజిస్టర్ ఐన ఫోన్ నంబర్ తో లాగిన్ కావలెను.  

రిజిస్ట్రేషన్ లింక్ https://pmshrischools.education.gov.in/school/login     

 లాగిన్ అయిన తర్వాత ఒక Questionnaire ఉంటుంది దీనిలో 44 ఇండికేటర్స్ ఉంటాయి మీరు వాటిని పూర్తి చేయాలి. 

PM SHRI- ఈ ఫార్మేట్ ను ముందుగా డౌన్లోడ్ చేసుకొని సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముందుగా నింపుకుని ఆ తర్వాత ఆన్లైన్ పేజిలో సబ్మిట్ చేయగలరు. ఎందుకంటే ఈ ఆన్లైన్ పేజి 15 నిమిషాలు మాత్రమే మీకు అందుబాటులో వుంటుంది ఆ లోపు సమాచారాన్ని పూర్తి చేయాలి.. లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి.

Download Questionnaire Click Here

ఇండికేటర్స్ ( కనీస మార్కులు):-

1.Infrastructure / Physical Facilities & School Safety (31 marks )

2.Teaching Staff and Capacity Building     (36 marks)    

3.PM Poshan Scheme    ( 16 marks)

4.Learning Outcomes, LEP, Pedagogy (30 marks)

5.Vocational Education under National Skill Qualifications Framework (NSQF) (Only for Sr. Secondary levels (20 marks)

6.Green Initiatives/ Activities by School (18 marks)

7.Commitment of Stakeholders ( 17 marks)

అప్లోడ్ చేయవలసినవి:-

1. ఫ్రంట్ ఇమేజ్

2. బ్యాక్ ఇమేజ్ 

3. హెడ్ మాస్టర్స్  అనుమతి కోరుతూ ఒక పత్రం

4. మీ స్కూల్ ఏ గ్రామ పరిధిలో ఉంటే ఆ గ్రామ కమిటీ అంగీకార పత్రం   

గమనిక :-

వెబ్సైట్లో పొందుపరచాల్సిన ప్రశ్నావళి , హెడ్మాస్టర్ అంగీకార పత్రం మరియు సర్పంచ్ అంగీకార పత్రం లను మేము పంపుతాము. వాటిని ముందుగానే మీ పాఠశాల లో ఉండే సదుపాయాల ఆధారంగా తయారు చేసుకొని తరువాత అప్లోడ్ చేయవలసి ఉంటుంది . ఎందుకంటే వెబ్సైట్లో డేటా ఎంటర్ చేయడానికి సమయం లిమిట్  ఉంటుంది.

కాబట్టి మనం ముందుగా డేటాను రెడీ చేసుకుంటే తొందరగా వెబ్సైట్లో డేటా పొందుపరచవచ్చు.

సెలక్షన్ విధానము

➯ప్రతి ప్రధానోపాధ్యాయుడు నింపినటువంటి ప్రశ్నావళి లోని సమాధానాల ఆధారంగా సెలక్షన్ జరగడం జరుగుతుంది.

➯మీరు ఇచ్చిన సమాధానాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో 60 శాతం మార్కులు అర్బన్ ప్రాంతంలోని పాఠశాలలు 70% మార్కులు సాధించిన వారు PM SHRI స్కూల్ లకు ఎంపిక కావడం జరుగుతుంది.

➯మీరు ఎంటర్ చేసిన డేటా ను జిల్లా శాఖ అధికారులు పరిశీలించి నిజమా అని నిర్ధారించిన తర్వాత మీ పాఠశాల ఈ స్కీం పరిధిలోకి రావడం జరుగుతుంది . 

➯ప్రధానోపాధ్యాయులు ఇచ్చే సమాధానాలకు కనీస మార్కులు కేటాయించడం జరుగుతుంది. కనీస మార్కులు సాధించిన స్కూలు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. 

 పాఠశాలల వారీగా కనీస మార్కులు

➨ప్రాథమిక పాఠశాల (1-5) కి 144 మార్కులు.

➨ప్రాథమికోన్నత పాఠశాలు (1-8) కి 165 మార్కులు

➨జిల్లా పరిషత్ పాఠశాలు ( 6 – 10/12 లేదా 1-12 ) 160 మార్కులు 

➨సీనియర్ సెకండరీ స్కూల్స్ (1-12): 168 మార్కులు 

➨కేంద్రీయ విశ్వవిద్యాలయం: 152 మార్కులు

➨జవహర్ నవోదయ విద్యాలయాలు : 144 మార్కులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles