Just In

6/trending/recent

Ads Area

Monkeypox: బీ అలర్ట్.. దేశంలోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే

 దేశంలో మంకీపాక్స్ (Monkeypox) కేసు వెలుగుచూడడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఆరోగ్యశాఖ విడుదల చేసింది. Monkeypox: బీ అలర్ట్.. దేశంలోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే

Monkeypox: బీ అలర్ట్.. దేశంలోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే

అంతర్జాతీయ ప్రయాణికులకూ పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే వారు.. అక్కడ అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని కోరింది. విదేశాలకు వెళ్లేవారు.. చర్మ సంబంధ వ్యాధులు, జననేంద్రియ వ్యాధులతో బాధపడుతోన్న వారికి దూరంగా ఉండాలి. చనిపోయిన లేదా బతికున్న జంతువులను నేరుగాతాకకూడదు. రోగులు ఉపయోగించిన దుస్తులు, పడక, ఇతర వస్తువులను వినియోగించకూడదని సూచనలు చేసింది. అంతే కాకుండా స్థానికంగా మంకీపాక్స్‌ కేసులు నమోదైనా, అలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారితో సన్నిహితంగా ఉన్నా సమీపంలోని హెల్త్ సెంటర్ కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కోరింది. మంకీపాక్స్‌ వైరస్ కేసులను నిర్ధారించేందుకు 15 వైరస్‌ రీసర్చ్‌ అండ్‌ డయాగ్నోటిక్‌ లాబొరేటరీస్‌ సిద్ధంగా ఉన్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

కాగా.. మానవాళికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్ వైరస్ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ అయింది. బాధిత వ్యక్తి విదేశాల్లో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ తెలిపారు. స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది జంతువుల నుంచి మానవులకు సోకుతుంది. తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తితో చనువుగా ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఈ వ్యాధి ఇతరులకు సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూఏఈలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఓ మంకీపాక్స్‌ రోగితో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. బాధితుడి తల్లిదండ్రులు సహా మొత్తం 13 మందిని ‘ప్రైమరీ కాంటాక్ట్స్‌’గా గుర్తించారు.

ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాపు, నడుమునొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలతో పాటు ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. వ్యాధికి గురైన వారిలో చాలా వరకు వారాల్లోనే కోలుకుంటారు. కొందిరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information