Trending

6/trending/recent

Municipal Schools Absorption : మున్సిపల్ స్కూల్స్ పై పర్యవేక్షణ కాదు.. ఆస్తులు, సిబ్బంది తో సహా విద్యాశాఖ లో విలీనమే.. ఇవిగో ప్రతిపాదనలు

 కౌన్సిల్ వారికి అంశము

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రజల కొరకు నీటి సరఫరా, సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్, రహదారులు & కాలువల ఏర్పాటు మరియు నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు మరియు నిర్వహణ మొదలగు అత్యవసర సేవలను అందజేస్తున్నాము. అంతేకాకుండా నగరపాలక సంస్థ యందు గల పాఠశాలలను కూడా నిర్వహించడం జరుగుతున్నది. అయితే విద్యా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు మరియు పర్యవేక్షించుటకు నగరపాలక సంస్థ యందు నిర్దేశిత అధికారులు / వ్యవస్థ పురపరిపాలన శాఖ యందు నియమించబడి ఉండలేదు.

ప్రభుత్వము అందిస్తున్న వివిధ పధకములు అనగా జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, వారధి మొదలగునవి విద్యాశాఖ, ఇతర శాఖలలోని పాఠశాలలతో పాటుగా నగరపాలక సంస్థ పాఠశాలలలో కూడా నిర్వహించుచున్నది.

అదే విధంగా విద్యాశాఖ పాఠశాలల భవనములను మరియు వాటి పరిరక్షణ కొరకు మనబడి, నాడు-నేడు కార్యక్రమం క్రింద అవసరమైన నిర్మాణాలను మరియు మౌలిక సదుపాయాలను అన్ని నగరపాలక సంస్థ పాఠశాలలలో కూడా చేపట్టుచున్నది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి పాఠశాలలు అన్నియు విద్యాశాఖ పర్యవేక్షణ మరియు పరిపాలనలో కొనసాగుచున్నవి. కావున రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాఠశాలలను కూడా మిగతా శాఖల పాఠశాలలతో సమానముగా బలోపేతం చేయుటకు సదరు పాఠశాలలను విద్యా శాఖ వారి పర్యవేక్షణ మరియు పరిపాలన నిమిత్తము బదిలీ చేయవలసిన అవశ్యకత ఉన్నది.

కావున రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ యందు ఉన్న మున్సిపల్ పాఠశాలలను మరియు బోధనా సిబ్బందిని విద్యాశాఖవారికి పర్యవేక్షణ, నిర్వహణ పరిపాలన సౌలభ్యం కొరకు బదిలీ చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నందు ఉన్న ఈ క్రింది పాఠశాలలను వాటి యొక్క స్థిరాస్తులతో సహా విద్యాశాఖ వారికి బదిలీ చేయుటకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం కొరకు సమర్పించడమైనది.

Download Schools List - Proposal to Council

Municipal Schools Absorption : మున్సిపల్ స్కూల్స్ పై పర్యవేక్షణ కాదు.. ఆస్తులు, సిబ్బంది తో సహా విద్యాశాఖ లో విలీనమే.. ఇవిగో ప్రతిపాదనలు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad