Just In

6/trending/recent

Ads Area

Wifi Calling: మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉందా? ప్రయోజనం ఏంటంటే?

 Wifi Calling | ఇటీవల అన్ని స్మార్ట్‌ఫోన్లలో వైఫై కాలింగ్ ఫీచర్ సపోర్ట్ లభిస్తోంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉందా? అసలు ఏంటి ఈ ఫీచర్? వైఫై కాలింగ్ ఫీచర్ ఎలా వాడుకోవాలి? తెలుసుకోండి.

Wifi Calling: మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉందా? ప్రయోజనం ఏంటంటే?

స్మార్ట్‌ఫోన్ అవసరాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అందుకే కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఏదైనా ప్రాంతంలో నెట్‌వర్క్ సరిగా లేకపోతే.. మొబైల్ నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేసేందుకు మీ స్మార్ట్‌ఫోన్ వైఫైని ఉపయోగించడాన్ని వైఫై కాలింగ్ (Wifi Calling) అంటారు. వైఫై కాలింగ్‌.. మీ టెలికాం ప్రొవైడర్ అందించే ఫీచర్. మన దేశంలో ఎయిర్‌టెల్, జియో, వీఐ వంటి అన్ని ప్రముఖ టెలికాం ప్రొవైడర్‌లు తమ కస్టమర్‌లకు Wi-Fi కాలింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఈ ఫీచర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వై-ఫై కాలింగ్ అంటే ఏంటి?

Wi-Fi కాలింగ్ అనేది మొబైల్ డేటాకు బదులుగా Wi-Fi నెట్‌వర్క్ ద్వారా కాల్స్, టెక్స్ట్‌ చేయగలిగే, స్వీకరించగలిగే ఫీచర్. ఇది కనెక్టివిటీ సరిగాలేని ప్రదేశాలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి కాల్స్ చేయడానికి టెలికాం ప్రొవైడర్ మొబైల్ నెట్‌వర్క్‌కు బదులుగా Wi-Fi నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. Wi-Fi కాలింగ్ అనేది టెలికాం ప్రొవైడర్ నుంచి ఆటోమెటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. Wi-Fi కాలింగ్‌ని యాక్టివేట్ చేయడానికి వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లలో ఏమీ చేయవలసిన అవసరం లేదు.

WI-FI కాలింగ్‌తో నార్మల్ కాలింగ్ కంటే ఎక్కువ డేటా లేదా బ్యాటరీ ఖర్చవుతుందా?

డేటా పరంగా చూస్తే.. Wi-Fi కాలింగ్ కాల్స్ చేయడానికి మీ Wi-Fi నెట్‌వర్క్‌ని మాత్రమే ఉపయోగిస్తుంది. మొబైల్ డేటాను అస్సలు ఉపయోగించదు. ఎయిర్‌టెల్ రిపోర్ట్ ప్రకారం.. 5 నిమిషాల Wi-Fi కాల్ 5MB డేటాను తీసుకుంటుంది. బ్యాటరీ వినియోగం చూస్తే.. స్మార్ట్‌ఫోన్ మొబైల్ నెట్‌వర్క్‌కు బదులుగా Wi-Fi ద్వారా అదే పనులను చేస్తున్నందున వినియోగం కూడా సాధారణ కాల్స్ మాదిరిగానే ఉంటుంది.

ఛార్జీలు ఎలా ఉంటాయి?

మీ టెలికాం ప్రొవైడర్ సర్వీస్‌లలో ఈ ఫీచర్‌ ఉంటే.. Wi-Fi కాలింగ్ మీ నెట్‌వర్క్ ప్రొవైడన్ తరఫున ఆటోమెటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఇది ఫ్రీ సర్వీస్. Wi-Fi కాలింగ్‌ని ఉపయోగించడం కోసం వినియోగదారులు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు Wi-Fi కాలింగ్ ఉందో లేదో తనిఖీ చేయడానికి.. మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. Android యూజర్లు.. సెట్టింగ్స్ > మొబైల్ నెట్‌వర్క్స్ లేదా కనెక్షన్స్ > Wi-Fiకి వెళ్లి.. ఆ తర్వాత Wi-Fi కాలింగ్ కనిపిస్తుందో లేదో చూడాలి. iPhone యూజర్లు సెట్టింగ్స్ > ఫోన్ > మొబైల్ డేటా > Wi-Fi కాలింగ్‌లోకి వెళ్లాలి. మీ ప్రొవైడర్ Wi-Fi కాలింగ్‌కు సపోర్ట్ చేస్తేనే.. ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

కాల్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుందా?

బ్యాడ్ కనెక్టివిటీ సమస్యకు చెక్ పెట్టడానికి డెవలప్ చేశారు కాబట్టి.. Wi-Fi కాలింగ్ విధానంలో కాల్ క్వాలిటీ బాగుంటుంది. అయితే కొన్నిసార్లు Wi-Fi కాల్స్ రిసీవర్స్‌కు కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. కాల్‌ వెళ్లడానికి యూజర్లు ఫోన్‌లో Wi-Fiని ఆఫ్ చేయాలి. ఇది ఒక చిన్న సమస్య. కొన్నిసార్లు నిర్దిష్ట యూజర్లకు మాత్రమే ఈ సమస్య ఎదురవుతుంది.

Wi-Fi కాలింగ్ ప్రయోజనాలు?

టెలికాం ప్రొవైడర్ నుంచి ఆటోమేటిక్ యాక్టివేషన్ అనేది మంచి ఆప్షన్. Wi-Fi కాలింగ్‌ని యాక్టివేట్ చేయడానికి యూజర్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. Airtel, Jio, Vi వంటి టెలికాం ప్రొవైడర్లు వినియోగదారులందరికీ ఆటోమెటిక్‌గా Wi-Fi కాలింగ్‌ను యాక్టివేట్ చేస్తాయి. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో Wi-Fi కాలింగ్‌ను యాక్టివేట్ చేయడానికి ఎటువంటి సైన్-అప్‌లు లేదా రిజిస్ట్రేషన్‌లు చేయాల్సిన అవసరం లేదు.

Wifi Calling: మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉందా? ప్రయోజనం ఏంటంటే?

Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information