Trending

6/trending/recent

Telugu Student: 15 ఏళ్ల తెలుగు విద్యార్థికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం.. ఎమ్మెల్సీగా ఎంపిక.. మంత్రి అయ్యే ఛాన్స్!

తెలుగు విద్యార్థికి ఆస్ట్రేలియా రాజకీయాల్లో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా దేశంలో యువత విభాగంలో ఎమ్మెల్సీ పదవికి ఎంపికయ్యారు.

Telugu Student: 15 ఏళ్ల తెలుగు విద్యార్థికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం.. ఎమ్మెల్సీగా ఎంపిక.. మంత్రి అయ్యే ఛాన్స్! 

Telugu Student in Australia: తెలుగు విద్యార్థికి ఆస్ట్రేలియా రాజకీయాల్లో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా దేశంలో యువత విభాగంలో ఎమ్మెల్సీ పదవికి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే గౌరవం ఈ యువకుడికి దక్కింది. ఎమ్మెల్సీనే కాకుండా మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అతిపిన్న వయస్సులో అస్ట్రేలియా మంత్రి దక్కించుకున్న వారిగా చరిత్ర సృష్టించనున్నారు.

నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన దివి తనూజ్‌ చౌదరి(15) కందుకూరుకు చెందిన దివి రామకృష్ణ, టంగుటూరుకు చెందిన పమిడి ప్రత్యూషను వివాహం చేసుకొని పది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో స్థిరపడ్డారు. రామకృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా రాణిస్తున్నారు. వారి కుమారుడు తనూజ్‌ చౌదరి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్లస్‌ వన్‌ చదువుతున్నాడు. పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆ బాలుడి ఆసక్తిని గుర్తించి రెండు వారాల క్రితం ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారని, శుక్రవారం ఉదయం అసెంబ్లీకి తీసుకెళ్లినట్లు రామకృష్ణ కందుకూరులో నివసిస్తున్న బాలుడి కుటుంబసభ్యులు తెలిపారు. అంతేకాక మంత్రిగా సైతం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు.

Telugu Student: 15 ఏళ్ల తెలుగు విద్యార్థికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం.. ఎమ్మెల్సీగా ఎంపిక.. మంత్రి అయ్యే ఛాన్స్!


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad