Trending

6/trending/recent

Miracle Gardens: 45లక్షల రకాల పూవ్వులను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ప్రపంచంలోనే అతి పెద్ద పూదోట ఎక్కడుందో తెలుసా..

 Miracle Gardens: అందమైన ప్రకృతిని చూస్తే పరవశించని మనసు ఉండదు. అందులోనూ వసంత ఋతువులో వికసించే పువ్వులు, సీతానొక చిలుకలు, కోయిల కువకువలను ప్రకృతి ప్రేమికులు..

Miracle Gardens: 45లక్షల రకాల పూవ్వులను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ప్రపంచంలోనే అతి పెద్ద పూదోట ఎక్కడుందో తెలుసా..

Miracle Gardens: అందమైన ప్రకృతిని చూస్తే పరవశించని మనసు ఉండదు. అందులోనూ వసంత ఋతువులో వికసించే పువ్వులు, సీతానొక చిలుకలు, కోయిల కువకువలను ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఆస్వాదిస్తారు. అందమైన పువ్వులు.. వాటి పరిమళం మనసుని పరవశింపజేస్తుంది. పైన నీలి రంగులో ఆకాశం, నేల మీద తివాచీ పరచుకున్నట్లు ఆకుపచ్చని గడ్డి, రంగు రంగుల పువ్వుల మొక్కలు అదీ సుమారు కొన్ని లక్షలకు పైగా పువ్వులు ఒక్కచోట కనిపిస్తే.. కనులే కాదు.. మనసు కూడా పురివిప్పిన నెమలిలా సంతోష పడుతుంది. ఇటువంటి గార్డెన్ దుబాయ్(Dubai)లో ఉంది. ఈ గార్డెన్ పేరు మిరకిల్ గార్డెన్(Miracle Gardens). ప్రపంచంలోనే అతిపెద్ద అందమైన అతి పెద్ద సహజ పూల తోట.

ఈ గార్డెన్‌లో సుమారు 45 లక్షల రకాల పూలు వికసిస్తాయి. దుబాయ్‌లోని మిరాకిల్ గార్డెన్స్ 72 వేల చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ గార్డెన్  14 ఫిబ్రవరి ప్రేమికుల రోజున 2013లో తెరవబడింది. దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఎడారిలో నిర్మించిన ఈ అద్భుతమైన పూల తోట. ప్రపంచంలోనే అతిపెద్ద పూల తోటగా బిల్లింగ్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది.  72,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 45 మిలియన్లకు పైగా పుష్పాలతో కనువిందు చేస్తుంది. ప్రతి సంవత్సరం నవంబర్ మధ్య నుండి మే మధ్య వరకు, సువాసనలతో కూడిన రంగుల పూలు ఇక్కడ దర్శనమిస్తాయి.

దుబాయ్‌ ల్యాండ్ నడిబొడ్డున .రంగురంగుల తోరణాలు అల్లుకున్నట్లు కనిపించే ఈ తోటను చూడడం ఓ గొప్ప అనుభూతి అని అంటారు సందర్శకులు. 150 మిలియన్ల పువ్వులతో పూర్తిగా వికసించి హాయినిస్తుంది. ఈ గార్డెన్‌లో బాలీవుడ్ చిత్రం ‘అవర్ అన్ ఫినిష్డ్ స్టోరీ’ షూటింగ్ కూడా జరుపుకుంది.

దుబాయ్ మిరాకిల్ గార్డెన్‌లోని ల్యాండ్‌స్కేపింగ్ 2013లో అతిపెద్ద వర్టికల్ గార్డెన్‌గా, 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద పూల శిల్పంలా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను సంపాదించింది. 18-మీటర్ల పూల శిల్పకళ మధ్యప్రాచ్యంలో మొదటి పుష్ప ప్రదర్శన.దాదాపు 1,00,000 మొక్కలు పూలతో దీనిని తయారు చేశారు. ఈ గార్డెన్‌లో అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే.. సందర్శకులు సందర్శించిన ప్రతిసారీ విభిన్నమైన అనుభూతిని పొందేలా చేసేందుకు ప్రతి సీజన్‌లో దాని పూల నిర్మాణాలు మార్చబడతాయి.

Miracle Gardens: 45లక్షల రకాల పూవ్వులను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ప్రపంచంలోనే అతి పెద్ద పూదోట ఎక్కడుందో తెలుసా..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad