Trending

6/trending/recent

Credit Card New Rules: క్రెడిట్ కార్డులకు RBI కొత్త రూల్స్.. ఆ రూల్స్ పాటించకపోతే రోజుకు రూ.500 ఫైన్..

Credit Card Rules: క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో రిజర్వు బ్యాంక్ తాజాగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటిని పాటించటంలో విఫలమైతే ఒక్కో రోజుకు రూ.500 చొప్పున జరిమానా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

Credit Card New Rules: క్రెడిట్ కార్డులకు RBI కొత్త రూల్స్.. ఆ రూల్స్ పాటించకపోతే రోజుకు రూ.500 ఫైన్..

Credit Card New Rules: క్రెడిట్​, డెబిట్​ కార్డుల మోసాలు, ఛార్జీల మోత నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(RBI) కొత్త మార్గదర్శకాలను తీసుకువస్తోంది. ఇప్పటికే కార్డుల జారీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని 2022 జులై 1 నుంచి అమలు చేయనుంది. ఈ నిబంధనలతో వినియోగదారులకు రక్షణతో పాటు సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం.. క్రెడిట్​ కార్డు క్లోజ్ చేయాలని కస్టమర్ నుంచి విజ్ఞప్తి వస్తే దానిని వారం రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. క్రెడిట్​ కార్డు క్లోజింగ్ కు సంబంధించిన విషయం కస్టమర్ కు వెంటనే ఈ-మెయిల్​, మెసేజ్​ ద్వారా సమాచారం అందించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన మెయిల్​ ఐడీతో పాటు, ఐవీఆర్​ సేవలను ఉపయోగించాలి. వాటి వివరాలు ఇంటర్నెట్​ బ్యాంకింగ్​, వెబ్​సైట్​లలో ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి. క్రెడిట్ కార్డు మూసివేత ప్రక్రియలో విజ్ఞప్తుల స్వీకరణకు సులువైన విధానాన్ని పాటించాలి. పోస్ట్ లేదా ఇతర మాధ్యమాల ద్వారానే విజ్ఞప్తి చేయాలంటూ నిబంధనలు విధించకూడదు. క్రెడిట్ కార్డ్ క్రోజింగ్ రిక్వెస్ట్ ను సకాలంలో పూర్తి చేయకపోతే.. ఆలస్యం చేసిన ప్రతిరోజుకు రూ.500 చొప్పున కస్టమర్​కు బ్యాంకు జరిమానా చెల్లించాలి.

సమాచారం ఇచ్చాకే..

ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు క్రెడిట్ కార్డును వినియోగించకుంటే.. కార్డు యజమానికి సమాచారం అందించిన తర్వాతే ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. 30 రోజుల వ్యవధిలోపు కార్డ్ యజమాని నుంచి ఎటువంటి సమాధానం రాకపోతే.. బకాయిల చెల్లింపునకు లోబడే ఖాతాను మూసివేయాలి. 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేత రికార్డును అప్‌డేట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ ఖాతా మూసివేసిన తర్వాత.. ఖాతాలో ఏదైనా క్రెడిట్ కార్డు నగదు ఉంటే దానిని యజమాని బ్యాంక్ ఖాతాకు ట్రాన్ఫర్ చేయాలి. క్రెడిట్​ కార్డు ఛార్జీలలో మార్పులు ఉంటే వాటి అమలుకు 30 రోజుల ముందే కస్టమర్లకు తెలపాలి. కార్డు యాక్టివేట్​ కాకముందే సిబిల్​, ఎక్సిపీరియన్ లాంటి క్రెడిట్​ బ్యూరోలకు ఇవ్వకూడదు. క్రెడిట్​ కార్డు ద్వారా ఇచ్చే ఈఎంఐల విషయంలో ట్రాన్పరెంట్ గా వ్యవహరించాలి.

బలవంతం చేయకూడదు..

సేవింగ్స్​, కరెంట్​ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే డెబిట్ కార్డులు జారీ చేయాలి. లోన్ అకౌంట్ ఖాతాదారులకు డెబిట్​ కార్డులు జారీ చేయకూడదు. డెబిట్​ కార్డు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని కస్టమర్లను ఒత్తిడి చేయకూడదు. డెబిట్ కార్డ్ తీసుకుంటేనే ఇతర సేవలు ఉంటాయంటూ షరతులు పెట్టకూడదు.

Credit Card New Rules: క్రెడిట్ కార్డులకు RBI కొత్త రూల్స్.. ఆ రూల్స్ పాటించకపోతే రోజుకు రూ.500 ఫైన్..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad