Just In

6/trending/recent

Ads Area

Change School Name Boards to New District Names - Orders : ELR పాఠశాల బోర్డులపై కొత్త జిల్లా పేరు తో మార్పు చేయమని ఆదేశాలు

జిల్లా విద్యాశాఖాధికారివారి కార్యవర్తనములు : ఏలూరు జిల్లా: ఏలూరు ప్రస్తుతం: శ్రీమతి.ఆర్.యస్. గంగా భవాని ఎం. ఎస్సీ బి.ఇడి

Rc.No. Spl/3/2022, తేదీ: 11-04-2022

విషయం:-విద్య-పాఠశాల విద్య జిల్లా పరిధిలోని అన్ని జిల్లా పరిషత్, గవర్నమెంట్, ఎయిడెడ్ - మరియు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తేదీ 04.04.2022 న జిల్లా ల పునర్ విభజన జరిగిన సందర్భంగా జిల్లా ల పేరు ను బోర్డుల యందు మార్పు చేయుటకు విషయమై అదేశాలు జారీచేయుట గూర్చి .

సూచిక: GO.Ms No. 173, Revenue Land. (IV) Dt.02.04.2022.

*****

పై సూచిక నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తేదీ. 04.04.2022 న జిల్లా లోని 13 జిల్లా లను పునర్ విభజన గావించి 26 జిల్లాలుగా మార్పు చేయడం జరిగినది. అందులో భాగముగా ప.గో. జిల్లా ను ఏలూరు జిల్లా గా మార్పు చేయడం జరిగినది. కావున ఏలూరు జిల్లా లోని అన్నీ జిల్లా పరిషత్ పాఠశాలలు , గవర్నమెంట్ గా పాఠశాలలు,ఎయిడెడ్ పాఠశాలలు, మరియు అన్నీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విధిగా ప.గో. జిల్లా గా ఉన్నా అన్నీ పాఠశాలల పేరుల బోర్డు లలో ప.గో.జిల్లా అను పదమును తొలగించి అందు ఏలూరు జిల్లాగా మార్పు చేయవలసిందిగా ఆదేశించడమైనది.

కావున పై సూచిక ననుసరించి జిల్లా లోని ఉప విద్యాశాధికారులు, మండల విద్యాశాధికారులు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఒఫ్ స్కూల్స్ వారు అందరు తమపరిధి లోని అన్నీ పాఠశాలల పేర్ల బోర్డు లను తొలగించి ఏలూరు జిల్లా గా మార్పు చేయవలసిందిగా తెలియచేయడమైనది. మరియు తమ పరిధిలో గల అన్నీ పాఠశాలల యందు తప్పనిసరిగా మార్పు చేయుటకు తగు చర్యలు తీసుకొనవలసిందిగా ఆదేశించడమైనది.

Change School Name Boards to New District Names - Orders : ELR పాఠశాల బోర్డులపై కొత్త జిల్లా పేరు తో మార్పు చేయమని ఆదేశాలు

Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information