Trending

6/trending/recent

Bed Room Photos : బెడ్‌రూమ్‌లో ఈ ఫొటోలు అస్సలు పెట్టకండి..మీకే మంచిది కాదు..

ఫ్యామిలీ స్టార్ట్ చేయబోయేముందు చేసే మొట్టమొదటి పని ఇల్లు వెతుక్కోవడం. ఈ ఇల్లు వెతుక్కోవడం బాగా సరదాగా కూడా ఉంటుంది. 

Bed Room Photos : బెడ్‌రూమ్‌లో ఈ ఫొటోలు అస్సలు పెట్టకండి..మీకే మంచిది కాదు..

కలిసి బతుకుదామనే నిర్ణయం తీసుకోవడం లైఫ్‌లో అన్నింటి కన్నా పెద్ద డెసిషన్. ఒక్కోసారి భయంగా కూడా అనిపిస్తుంది. అనేక రకాల ఛాలెంజెస్‌ని ఫేస్ చేయవలసి వస్తుంది. కొన్ని వాస్తు టిప్స్ పాటిస్తే ఈ ఛాలెంజెస్‌ని ఈజీగా ఫేస్ చేయవచ్చు అంటారు నిపుణులు. వాస్తు శాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితం ఆనందంగా ఆరోగ్యంగా అభివృద్ధికరంగా సాగుతుంది అంటారు నిపుణులు.

  • భారతీయులు ఎక్కువగా నమ్మే వాస్తు
  • కొన్ని విషయాల్లో వాస్తు నమ్మాలంటున్న పండితులు
బంధాన్ని నిలబెట్టడానికి వాస్తు ఎంత ఉపయోగపడుతుందో సరిగ్గా వాడుకోకపోతే అంతే గట్టిగా బంధాన్ని నిర్వీర్యం చేయగలదు. అందుకే, మీ కొత్త జీవితం ప్రారభించబోయేప్పుడు ఈ వాస్తు టిప్స్ ఫాలో అవ్వండి.

1. నార్త్ ఈస్ట్‌లో బెడ్‌రూమ్ వద్దు..

ఇంట్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్‌లోబెడ్‌రూమ్ ఉండడాన్ని ఎవాయిడ్ చేయండి. ఎందుకంటే, ఇలా ఉంటే అది నెగెటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ డైరెక్షన్‌లో బెడ్రూం ఉంటే అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి. వాగ్వాదాలూ గొడవలూ ఎక్కువైపోతాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ బెడ్రూమ్‌లో ఉండే జంట విడిపోరు, కలిసి ఉండలేరు.

2. బెడ్రూమ్‌లో రాధా కృష్ణుల ఫోటో వద్దు..

బెడ్రూమ్‌లో ఎప్పుడూ రాధా కృష్ణుల ఫోటో పెట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళ ప్రేమ కధకి సరైన ముగింపు లేదు, బెడ్రూం‌లో ఆ ఫోటో సరైన ఎనర్జీ ఇవ్వదు. ఇలా ఉంటే గొడవలు రావడం, ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ ఉండడం వంటి వాటితో పాటు హఠాత్తుగా బంధం ముగిసిపోవచ్చు కూడా.

3. దేవుళ్ళ విగ్రహాలు వద్దు..

బెడ్రూమ్‌లో దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకోవద్దు. ఇవి లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా లాంటి న్యూట్రల్ స్పేసెస్ లో దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకోవచ్చు కానీ బెడ్రూమ్‌లో ఇవి సరైన ఎన్విరాన్మెంట్‌ని కలిగించవు.

4. మొక్కలు..

సౌత్ వెస్ట్ డైరెక్షన్‌లో మొక్కలు పెట్టుకోకండి. ఇంట్లో మొక్కలు పెట్టుకోవడం ఎంతో మంచిది. అయితే, ఎక్కువ సన్‌లైట్ వస్తుందని సౌత్ వెస్ట్ డైరెక్షన్‌లో మొక్కలు పెడుతూ ఉంటారు కానీ అది సరైన పద్ధతి కాదు. ఇలా ఉంటే అనేక రకాల అభిప్రాయ భేదాలకీ గొడవలకీ కారణం కావచ్చు.

5. ఫోటోలు, ఆల్బమ్స్..

బంధం బలహీన పడకుండా ఉండడానికి సౌత్ వెస్ట్ డైరెక్షన్‌లో ఫోటోస్ గోడకి తగిలించుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ కోసం వీటిని సరైన డైరెక్షన్‌లో ఉంచడం అవసరం.

వీటితో పాటు కలిసి బతుకుదామని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ క్రింది విషయాలు కూడా గుర్తు పెట్టుకోండి.

1. మీ ఫ్యూచర్ ప్లాన్స్‌లో ముందుగా ఆలోచించుకోవలసింది మీరు మీ ఫ్యామిలీని ఎప్పుడు ఎక్స్పాండ్ చేద్దామనుకుంటున్నారని. మీరు పిల్లల్ని ఎప్పుడు మీ జీవితంలోకి ఆహ్వానిద్దామనుకుంటున్నారు, పెట్స్ కావాలనుకుంటే ఎప్పుడు పెంచుకోవాలి వంటివి కూదా ఆలోచించుకోండి.

2. మీ ఇంటికి గెస్ట్స్ ని ఇన్వైట్ చేయాలా వద్దా ఆలోచించుకోవాలి. మీరిద్దరూ కూడా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయాలి అనుకుంటే గెస్ట్ బెడ్రూం ఉన్న ఇల్లు ఎంచుకోవాలి. పెద్దగా ఎవరినీ ఇన్వైట్ చేయవద్దు అనుకుంటే ఫ్యూటన్ చాలు.

3. ఇంకొక ఇంపార్టెంట్ విషయం బడ్జెట్ క్రియేట్ చేసుకోవడం. ఖర్చు వెచ్చాలు, సేవింగ్స్ వంటివి ఆలోచించుకోవాలి. ఇలా ఉంటే ఈ విషయాల్లో ఫ్యూచర్‌లో టెన్షన్స్ రాకుండా ఉంటాయి. బిల్స్‌కి సంబంధించి ఒక సిస్టం క్రియేట్ చేసుకోవడం, జాయింట్ ఎకౌంట్ ఏర్పరచుకోవడం, బడ్జెటింగ్ గోల్స్‌ని షేర్ చేసుకోవడం వంటివి ఎంతో హెల్ప్ చేస్తాయి.

4. ఇంటి పనులు షేర్ చేసుకోవడం గురించి కూడా మాట్లాడుకోండి. మీకు వంట విసుగ్గా అనిపించవచ్చు, మీ పార్ట్నర్‌కి గిన్నెలు కడగడం అంటే చిరాకు ఉండవచ్చు. ఈ పనులు రెండవవారికి విసుగు లేనంతవరకూ పరవాలేదు కానీ ఇద్దరికీ కూడా నచ్చని కొన్ని పనులు ఉండవచ్చు. బాత్రూం క్లీనింగ్, బట్టలు మడత పెట్టడం వంటి పనులు ఆల్మోస్ట్ ఎవరికీ నచ్చవు. ఇలాంటి వాటిని వంతులు వేసుకుని చేయడం తప్ప మార్గం లేదు.

5. ఇద్దరూ కలిసి ఉందామనుకున్నప్పుడు ఇద్దరి దగ్గర ఉన్న వస్తువుల విషయంలో ఒక అంగీకారానికి రావాలి. ఇద్దరి దగ్గరా కాఫీ మేకర్ ఉంటే ఏది ఉంచుకోవాలి, ఏది తీసేయాలి. ఏ కాఫీ కప్స్ ఉంచాలి, ఏవి వదిలేయాలి.. లాంటి విషయాలు ఆలోచించుకోవాలి. అలాగే, వద్దు అనుకున్న వాటిని ఏం చేయాలో కూడా డిసైడ్ చేసుకోవాలి.

6. అయితే, కొన్ని సెంటిమెంటల్ వస్తువులు ఇద్దరికీ ఉంటాయి. వాటిని మీతో పాటు ఉంచుకోవడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.

7. అలాగే, ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కప్‌బోర్డ్స్‌లో ఏ షెల్వ్స్ ఎవరివి అన్నది తేల్చుకోవడం.

8. ఇంకొక విషయం మీరు ఆలోచించుకోవలసింది ఇంటి డెకరేషన్ గురించి.ఇందులో ఇద్దరికీ భేదాభిప్రాయాలు ఉంటే ఒక అంగీకారానికి వచ్చే డెకరేషన్ ఐటెమ్స్ కొనండి.

9. గ్యాడ్జెట్స్ వాడడంలో ఒక అంగీకారానికి రావడం కూడా అవసరమే. ఒకరికి డిన్నర్ చేస్తూ సోషల్ మీడియా చెక్ చేసుకోవడం ఇష్టమైతే మరొకరికి మూవీ చూస్తూ వర్క్ మెయిల్స్ చెక్ చేసుకోవడం ఇష్టం కావచ్చు. ఇది రెండవవారికి అయిష్టంగా ఉంటే మాత్రం కొన్ని గ్రౌండ్ రూల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాటిని ఫాలో అవ్వడం ఉత్తమం.

10. మీరిద్దరూ కలిసి జీవిస్తున్నా కూడా ఇంట్లో మీదైన ఒక ప్లేస్ ఉండడం అవసరం. అది ఒక పడక్కుర్చీ కావచ్చు, బాల్కనీలో ఉయ్యాల కావచ్చు. ఆ స్పేస్ మీదే. అలాంటి ఒక స్పేస్ ‌క్రియేట్ చేసుకోండి.

చివరగా..

కలిసి ఉండడం ఎంత ఆనందదాయకమయినా ఆ ప్రాసెస్ లో మీరు మీ ఐడెంటిటీని కోల్పోకూడదు. కాబట్టి ఇద్దరూ కూడా కొంత మీ టైం ని షెడ్యూల్ చేసుకోండి. అప్పుడే మీరిద్దరూ చక్కని, బాధ్యతాయుతమైన జంట అవుతారు.

Bed Room Photos : బెడ్‌రూమ్‌లో ఈ ఫొటోలు అస్సలు పెట్టకండి..మీకే మంచిది కాదు..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad