Saturday, July 27, 2024
BC Welfare Residential Schools - 2022-23...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

BC Welfare Residential Schools – 2022-23 Admissions Notification Released

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

మహాత్మా జ్యోతిభాఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, (0), 2వ అంతస్తు, ప్లాట్ నం. 9, 4వ వీధి, బండిస్టాన్లీ వీధి, ఉమా శంకర్ నగర్, కానూరు, విజయవాడ – 520 007.

2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన

మహాత్మా జ్యోతిభా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ నడుపబడుచున్న 98 గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశము (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్ధులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాలల కేటాయింపు జరుగును.

ప్రవేశానికి అర్హత 1. వయస్సు ఓ.సి., బి.సి మరియు ఈ.బిసి. (O.C/B.C/E.BC) లకు చెందిన వారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి మరియు ఎస్.టి (S.C/ST) లకు చెందిన వారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. 2. సంబంధిత జిల్లాలో 2020-21 మరియు 2021-22 విద్యా సంవత్సరాలలో నిరవధికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి. 3. ఆదాయ పరిమితి అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి, సంరక్షకులు సంవత్సర ఆదాయం 2012 సంవత్సరమునకు రూ. 1,00,000 లకు మించి ఉండరాదు. 4. దరఖాస్తు దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://www.mjpapbcwr.in ను చూడగలరు. 5. దరఖాస్తు చేయు విధానం: అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేది. 28,03,2022 నుండి తేది 27,04,2022 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయు విధానములో సందేహ మున్నదో పాఠశాల కార్యాలయ పని వేళలు ఉ. 10.00 గం. ల నుండి సాయంత్రము 4.30 గం. ల లోపు జిల్లా లోని క్రింద ఇవ్వబడిన పాఠశాలల ప్రిన్సిపల్ అ నెంబర్ లకు సంప్రదించగలరు.

[post_ads]

పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం..

  • రిజర్వేషన్ (రిజరేషన్ల వివరాలు పట్టిక (1) నందు ఇవ్వబడినది).
  • స్థానికత
  • ప్రత్యేక కేటగిరి (ఆనాధ/మత్స్య కారుల పిల్లలు).
  • అభ్యర్థి కోరిన పాఠశాలల ఆధారంగా ఎంపిక జరుగును.
  • జిల్లాల వార్ పాఠశాలల వివరాలు, జిల్లాల పట్టిక మరియు పాఠశాల వారీగా. కేటాయించిన సీట్ల పట్టిక (2) నందు ఇవ్వబడినవి.
  • ప్రవేశములు లాటరీ పద్ధతి ద్వారా చేయబడును.
BC Welfare Residential Schools - 2022-23 Admissions Notification Released

విద్యార్థులకు అందించే సదుపాయాలు

  • ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం.
  • నెలకు రూ. 1250 లతో పాక్షిక విలువలతో కూడిన మెనూ
  • 4 జతల యూనిఫాం దుస్తులు.
  • దుప్పటి మరియు జంపుభాన
  • బూట్లు, సాక్స్
  • టై మరియు బెల్ట్
  • నోట్ పుస్తకములు, టెక్స్ట్ పుస్తకములు
  • ప్లేట్, గ్లాస్, కటోర
  • కాస్మోటిక ఛార్జీల నిమిత్తం బాలురకు నెలకు 100 రూ. ల చొప్పున (5,6 ), 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 125 రూ.ల బాలికలకు 6, 7వ తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 110 రూ. ల చొప్పున మరియు 8వ తరగతి ఆపై క్లాసులు పిల్లలకు నెలకు 160 రూ. ల చొప్పున చెల్లించడం జరుగుతున్నది. మరియు బాలురకు నెలకు రూ. 30 చొప్పున సెలూను నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది.
  • 5వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్ధి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్యను అభ్యసించవచ్చును.
  • సమీకృత పౌష్టిక ఆహారం క్రింద రోజూ వేరుశెనగ చిక్కి వారానికి ఆరు దినములు గ్రుడ్లు, రెండు సార్లు చికెన్ యివ్వబడును.

ఉల్లాసభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది. గ్రంధాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యా బోధన జరుగుతుంది. దరఖాస్తులను ఆన్ లైన్లో http://cet.apcfss.in/MJPAPBCWR/ వెబ్ సైల్లో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకోనగలరు.

Download Notification for More Details Click Here

[post_ads]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles