Trending

6/trending/recent

AP News: మరోసారి ఏపీకి నెంబర్ వన్ ర్యాంక్.. జాతీయ స్థాయిలో అవార్డు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) ఇప్పటికే పలు అంశాల్లో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ లో నిలిచింది. తాజాగా మలేరియా నిర్మూలనలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన ఎపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది.

AP News: మరోసారి ఏపీకి నెంబర్ వన్ ర్యాంక్.. జాతీయ స్థాయిలో అవార్డు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) ఇప్పటికే పలు అంశాల్లో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ లో నిలిచింది. తాజాగా మలేరియా నిర్మూలనలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన ఎపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. మలేరియా దినోత్సవం సందర్భంగా కేంద్రం అవార్డులను ప్రకటించింది. మలేరియా నిర్మూలనకు ప్రభుత్వం గత మూడేళ్లుగా నిరంతరాయంగా చేసిన కృషికి ఫలితంగా 2018లో నమోదయిన 6,040 కేసుల స్థాయి 2021లో 1,139కి చేరింది. ఏపీ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 2021లో మొత్తం 75,29,994 రక్తపరీక్షల నమూనాలను పరిశీలించగా అందులో 1,139 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

25 లక్షలకు పైగా దోమతెరల పంపిణీ

రాష్ట్రంలో హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాలలో 2021లో 21.50 లక్షలు, గతంలో వున్న 13 జిల్లాల్లో మొత్తం 25.94 లక్షల దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో మలేరియా కేసులు వెలుగు చూసిన హైరిస్క్ ప్రాంతాలలో ఏటా ఇళ్లలో దోమల నిరోధం కోసం ఇండోర్ రెసిడ్యుయల్ (ఐఆర్ఎస్) కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ఏడాది మొత్తం 9.22 లక్షల మంది జనాభా కలిగిన 3,027 గ్రామాలలో 2, 3 విడతలలో ఐఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం.. నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మలేరియా కేసుల నిరోధక కృషిలో భాగంగా గత ఏడాది ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో దోమల నిరోధక వలలను ఏర్పాటు చేసింది.

'ఫ్రైడే-డ్రైడే' పేరుతో క్రిమి కీటక నిరోధక, ఆరోగ్య పరిరక్షణ యాప్ ను అభివృద్ధి చేసిన ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో దోమల కట్టడి, మలేరియా నిరోధం కోసం PR&RD, RWS MA&UD విభాగాల సమస్వయంతో చర్యలు ప్రారంభించింది. దోమల పెరుగుదలను అరికట్టే చర్యల్లో భాగంగా గత ఏడాది మత్స్య శాఖ సమన్వయంతో 24లక్షల గంబూజియా చేపలను పెంపకం దారులకు పంపిణీ చేసింది. ఈ చర్యల ఫలితంగా మలేరియా దోమల వ్యాప్తి కట్టడి కావటంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కేవలం 117 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కార్యక్రమంలోనూ ఏపీ టాప్ లో నిలిచింది. ఇప్పటి వరకూ 1,90,25,469 మందికి  డిజిటల్ హెల్త్ ఐడీలు క్రియేట్ అయ్యారు. అలాగే  వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి బోధనాసుపత్రి వరకూ 14,368 ఆసుపత్రులు రిజిస్టర్ అయ్యారు. మొత్తం 7,345 మంది ప్రభుత్వ వైద్యులు రిజిస్టర్‌ అయ్యారు. పౌరులు, ఆసుపత్రులు, వైద్యులు మూడు విభాగాల రిజిస్ట్రేషన్‌లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం.

AP News: మరోసారి ఏపీకి నెంబర్ వన్ ర్యాంక్.. జాతీయ స్థాయిలో అవార్డు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad