Trending

6/trending/recent

AP Inter 1st Year English Model Paper: ఏపీ ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్‌

AP Inter 1st Year English Model Paper | కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పరీక్షలను నిర్వహించాల్సిన షెడ్యూల్ ను వాయిదా వేయడమో, సిలబస్ తగ్గించడమో చేయాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రభుత్వం గత ఏడాది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను వాయిదా వేస్తూ వచ్చింది.

AP Inter 1st Year English Model Paper: ఏపీ ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్‌

కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పరీక్షలను నిర్వహించాల్సిన షెడ్యూల్ ను వాయిదా వేయడమో, సిలబస్ తగ్గించడమో చేయాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రభుత్వం గత ఏడాది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలన్న నిర్ణయంతో.. వాయిదా పడ్డ పరీక్షలను ప్రతీ సబ్జెక్ట్ లోనూ 70 శాతం సిలబస్ తో మాత్రమే కండక్ట్ చేసారు. మిగిలిన 30 శాతం సిలబస్ ను ఎగ్జామ్స్ నుండి తొలగించి ప్రశ్నాపత్రాలు ఇచ్చారు. ఈ ఏడాది వైరస్ ప్రభావం కొంత తగ్గడంతో విధ్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వాలు భావించి.. ఈ మేరకు పరీక్షల తేదీలను సైతం విడుదల చేశారు  ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు.

కానీ.. ఈ ఏడాది కూడా కోవిడ్ కారణంగా ఆన్లైన్ విధానంలోనే క్లాసులు జరిగాయి. దీంతో సిలబస్ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో.. విద్యార్ధుల భవిష్యత్తు ద్ళష్ట్యా.. ఈ ఏడాది కూడా 30 శాతం సిలబస్ ను కొంత మేర తగ్గించారు. దీంతో ప్రశ్నాపత్రాలను కూడా ఆ 70 శాతం నుండే ఇచ్చేలా సిలబస్ తగ్గించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తోంది న్యూస్18 తెలుగు. ఇందులో భాగంగా గుర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఇంగ్లీష్ అధ్యాపకులైన రమణ.. అందించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్.. విద్యార్థుల కోసం..

ఫస్టియర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ లో ఎప్పటిలానే ప్రతీ ఏడాదిలానే 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రోజ్(గద్య భాగం)(PROSE), పోయెట్రీ(పద్య భాగం)(POETRY), నాన్ డిటైల్డ్ (నామవాచకం)(NON DETAILED), కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్ (COMPREHENSION PASSAGES), గ్రామర్(వ్యాకరణం) (GRAMMER) ఇస్తారు. వీటి నుండి ప్రతీ ఏడాది పరీక్షలలో పద్య భాగం, గద్య భాగం, కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్.. మూడూ కలిపి 50 మార్కులకు, వ్యాకరణం(GRAMMER) 50 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. విద్యార్ధులకు ఇంగ్లీష్ భాష అలవడటం కోసం, విద్యార్ధులు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో.. ఒక్క గ్రామర్ నుండి మాత్రమే 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.


ఫస్టియర్ ఇంగ్లీష్ పేపర్ లో మొదటి 50 మార్కులకు ప్రోజ్(గద్య భాగం)(PROSE) 16 మార్కులు, పోయెట్రీ(పద్యభాగం)(POETRY) 16 మార్కులు, నాన్ డిటైల్డ్ (నామవాచకం)(NON DETAILED) 8 మార్కులు, కాంప్రెహెన్షన్ ప్యాసేజెస్(COMPREHENSION PASSAGES) 10 మార్కులు మొత్తంగా 50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మొత్తం ఎగ్జామ్ పేపర్ ను మూడు సెక్షన్లుగా విభజించారు. SECTION-A, SECTION-B, SECTION-C గా మూడు భాగాలు ఉంటాయి. ఈ మూడు సెక్షన్లలో 20 సబ్ సెక్షన్స్ ఉంటాయి. SECTION-Aలో ఐదు సబ్ సెక్షన్స్, SECTION-B లో 2 సబ్ సెక్షన్లు, SECTION-C లో గ్రామర్ పార్ట్ లో 13 సబ్ సెక్షన్స్ ఉంటాయి.

మొదట SECTION-A చూద్దాం. ఇందులో 1) ప్రోజ్( prose)లో ఉన్న 5 పాఠాలు(లెసన్స్)LESSONS నుండి పరీక్షలో 4 సందర్భ వ్యాక్యాలు (annotations) వస్తాయి. ఇందులో రెండు ఛాయిస్ కాగా, రెండు సమాధానాలు 10 నుండి 15 లైన్ల మధ్య రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలకు 4 మార్కుల చొప్పున 8 మార్కులు ఉంటాయి. 2) ఇందులో పోయెట్రీ(POETRY) లో 5 పాఠాలు(లెసన్స్) LESSONS నుండి పరీక్షలో 4 సందర్భ వ్యాక్యాలు (annotations) 8 మార్కులకు వస్తాయి.

ఇందులో రెండు ఛాయిస్ కాగా, రెండు రాయాల్సి ఉంటుంది. 3) ప్రోజ్ (గద్యభాగం)(poetry) నుండి మరో 8 మార్కులకు 2 పేరాగ్రాఫ్ జవాబులు రాయాల్సి ఉంది. వీటిలో ఛాయిస్ ఉండదు. రెండూ రాయాల్సి ఉంటుంది. 4)పోయెట్రీ (పద్య భాగం) (poetry) మరో 8 మార్కులకు 2 పేరాగ్రాఫ్ ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 10 నుండి 15 లైన్ల జవాబులు రాయాలి. ఛాయిస్ ఉండదు. 5) ఇందులో నాన్ డిటైల్డ్(NON DETAILED)(extensive reading) నుండి 8 మార్కులు ఉంటాయి.

మొత్తం 5 షార్ట్ లెసన్స్ నుండి మూడు ఎస్సై ప్రశ్నలు ఇస్తారు. ఇందులో రెండు ఛాయిస్ కాగా, ఒక దానికి సమాధానం రాయాలి. 25 నుండి 30 లైన్ల మధ్య వ్యాసరూప సమాధానం రాయాలి. మూడింటిలో ఒక దానికి సమాధానం రాస్తే సరిపోతుంది. మొత్తంగా ప్రోజ్ నుండి 16 మార్కులు, పోయెట్రీ నుండి 16 మార్కు లు, నాన్ డిటైల్డ్ నుండి మరో 8 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మొత్తంగా SECTION-A నుండి 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

రెండవది SECTION-B చూద్దాం. ఇందులో 6) 7) సబ్ సెక్షన్ల కింద రెండు కాంప్రెహెన్షన్ ప్యాసేజెస్(COMPREHENSION PASSAGES)కు సంబంధించిన ప్యాసేజెస్ వస్తాయి. ఈ సెక్షన్ లో రెండు ప్యాసేజెస్ నుండి 10 మార్కులకు ఉంటాయి. ఒక్కో ప్యాసేజ్ కింద ఐదు ప్రశ్నలు ఇచ్చి వాటికి సమాధానాలు రాయమంటారు. సరైన జవాబులు రాయాల్సి ఉంది. ఛాయిస్ ఉండదు. మొత్తంగా SECTION-A లో ఐదు సబ్ సెక్షన్స్, SECTION-B లో రెండు సబ్ సెక్షన్ ల నుండి 50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

మూడవది SECTION-C చూద్దాం. ఇందులో గ్రామర్ ( వ్యాకరణం) (GRAMMER) పార్ట్ కు సంబంధించిన మొత్తం 13 సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ నుండి 50 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 8) ఏ, ఏన్, ది(ఆర్టికల్స్) (ARTICLES) నుండి 3 మార్కులు, 9) ప్రపోజిషన్స్( PREPOSITIONS) 3 మార్కులకు, 10) suitable forms of verbs 5 మార్కులకు 11) rewrite the sentences 5మార్కులకు,

12)rewrite the sentences with underlined part నుండి 5 మార్కులు 13) sentences with phrasal verbs నుండి 3 మార్కులకు, 14) identify the silent consonents 3 మార్కులకు 15) identify the parts of speech 3 మార్కులకు 16) మ్యాచింగ్స్ కాలమ్స్( matching columns) 3 మార్కులకు 17) short paragraphs నుండి 5 ప్రశ్నలు 5 మార్కులకు 18) స్పెల్లింగ్ కరెక్షన్స్ or స్ట్రెస్ వర్డ్స్ 5 మార్కులకు 19) identify the syllables 3 మార్కులకు 20) డైలాగ్ రైటింగ్ (dialogue writing) 4 మార్కులకు.. వస్తాయి. ఇలా గ్రామర్ పార్ట్ లో 13 సెక్షన్లలో అన్నీ కలిపి 50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

మొత్తంగా SECTION-A లో 40 మార్కులు, SECTION-Bలో 10 మార్కులు, SECTION-C లో 50 మార్కులు కలిసి 100 మార్కులకు ప్రశ్నాపత్రం వస్తుందని నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ సవరపు రవణ చెబుతున్నారు.  పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చని ఆయన వివరించారు. గ్రామర్ పార్ట్ పై పట్టు సాధిస్తే.. SECTION-C నుండి వచ్చే గ్రామర్ ప్రశ్నలకు తక్కువ సమయంలో సమాధానాలు రాసి ఎక్కువ మార్కులు సాధించవచ్చని ఆయన తెలిపారు.

SECTION-A లో ఉన్న ప్రోజ్(గద్య భాగం) లోని ఐదు LESSONS నుండి Disaster Management అనే ఒక lesson ను తొలగించారు. ఇక పోయెట్రీ (poetry) లోని ఐదు poems నుండి BODY అనే ఒక poem ను తొలగించారు.

SECTION-A లోని పద్య బాగం(prose) నుండి 4 లెసన్స్, గద్య భాగం(poetry) నుండి 4 లెసన్స్ మాత్రమే మిగలాయి. అంటే గద్య, పద్య భాగాల నుండి ప్రతీ లెసన్ నుండి annotations, paragraph questions వస్తాయి. ఇక్కడ ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే.. గద్య(prose), పద్య(poetry) భాగాల నుండి ఉన్న ప్రతీ lesson నుండి ఒక annotation, ఒక paragraph question వస్తుంది. కాబట్టి ఉన్న సిలబస్ నుండి గద్య భాగంలో రెండు lessons, పద్య భాగం నుండి రెండు lessons చదివితే..

మొదటి నాలుగు sections రాసేయవచ్చు. మొత్తం 32 మార్కులు ఈజీగా సాధించవచ్చు. prose నుండి రెండు లెసన్స్, poetry నుండి రెండు లెసన్స్ చదివితే.. మొత్తంగా 32 మార్కులకు సమాధానాలు రాసేయవచ్చు. ఇక 5వ సెక్షన్ లో నాన్ డిటైల్డ్ (NON DETAILED) అయిన ఐదు చాప్టర్ల నుండి The immaculate Child, The Informer-one act play అనే రెండు చాప్టర్లను తొలగించారు. దీంతో ప్రస్తుతం నాన్ డిటైల్డ్ లో మూడు చాప్టర్లు మాత్రమే మిగిలాయి. అంటే గతంలో ఐదు చాప్టర్ల నుండి వచ్చే మూడు ఎస్సై ప్రశ్నలు.. ఇప్పుడు కేవలం 3 చాప్టర్ల నుండి వస్తాయి. అంటే ప్రతీ చాప్టర్ నుండి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. దీనినిబట్టి.. ఏ ఒక్క చాప్టర్ ను బాగా చదివి గుర్తుపెట్టుకుంటే.. నాన్ డిటైల్డ్ నుండి వచ్చే ఒక 8 మార్కుల ప్రశ్నను సులభంగా రాసేయవచ్చు.

SECTION-C నుండి గ్రామర్ పార్ట్ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో బేసిక్ గ్రామర్ ప్రశ్నలు వస్తాయి. టెస్ట్ బుక్ లో ప్రస్తుతం ఉన్న సిలబస్ నుండి ఇచ్చిన గ్రామర్ ను కొద్దిగా వీటిని ముందే ప్రాక్టీస్ చేయగలిగితే.. SECTION-Cలో మంచి మార్కులు సాధించవచ్చు. మొత్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ మంచి మార్కులతో పాసయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.

[post_ads]
AP Inter 1st Year English Model Paper: ఏపీ ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్ మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్‌

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad