Trending

6/trending/recent

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ ఎప్పుడు? ఈ రోజు ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా?

అక్షయ తృతీయ హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష మూడవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున అనేక శుభకార్యాలు చేయవచ్చు. 

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ ఎప్పుడు? ఈ రోజు ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా?

ఈసారి అక్షయ తృతీయ 2022 మే 3న రానుంది. ఈ రోజున లక్ష్మీ దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎంతలా అంటే ఈరోజు బంగారం కొంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం.

బంగారం లేదా మరేదైనా వస్తువు కొనడానికి అక్షయ తృతీయ మంచి రోజు అని చాలా మందికి తెలుసు. దీని వెనుక ఉన్న ఆచరణ ఏమిటి? ఈ రోజు ఎందుకు ముఖ్యమైనది అనే దాని గురించి తెలుసుకుందాం.

ఈ సంవత్సరం అక్షయ తృతీయ 2022 మే 3వ తేదీన. రోహిణి నక్షత్రంలో మధ్యాహ్నం 12:34 గంటలకు ప్రారంభమై మే 4వ తేదీ మధ్యాహ్నం 3:18 గంటలకు ముగుస్తుంది.

అక్షయ తృతీయ వివాహంతో పాటు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. దానం చేయడం వల్ల ధాన్యం సుసంపన్నం అవుతుంది.

విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు అక్షయ తృతీయ రోజున జన్మించాడని నమ్ముతారు. పరశురామ జయంతిని కూడా ఈ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటారు.

భగీరథుని కఠోరమైన తపస్సుకు సంతోషిస్తూ ఈ రోజునే గంగామాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజున అన్నపూర్ణ తల్లి జన్మించిందని కూడా నమ్ముతారు. కాబట్టి ఈ రోజు పూజగదిని, ఆహార ధాన్యాలను పూజించాలి

అక్షయ తృతీయ రోజున, శంకరుడు కుబేరుడిని లక్ష్మిని పూజించమని కోరాడు. కావున ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. నర-నారాయణుడు అక్షయ తృతీయ రోజున అవతరించినట్లు నమ్ముతారు.

మహాభారతం ప్రకారం, ఈ రోజున శ్రీకృష్ణుడు పాండవుల వనవాస సమయంలో వారికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎల్లప్పుడూ ఆహారంతో నిండి ఉంటుంది. దీంతో పాండవులకు వనవాసంలో ఉన్నా వారికి ఆహారం విషయంలో ఇబ్బంది కాలేదు.

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ ఎప్పుడు? ఈ రోజు ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా?


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad