Trending

6/trending/recent

Teacher Dairy Complaint : చాలా మంది ఉపాధ్యాయులు టీచర్ డైరీ పూర్తి చేయడం లేదని ఫిర్యాదు, తనిఖీ చేయాలని ఆదేశాలు

జిల్లా విద్యాశాఖాధికారి వారి ఉత్తర్వులు, కృష్ణా, మచిలీపట్నం

శ్రీమతి. తాహిర సుల్తానా, ఎం.ఎస్సి, బి.ఇడి., ఎం.ఫిల్., 

Rc.No.800/M2/2022,       Dt.02.03.2022

newStone.in - Teacher Dairy Complaint : చాలా మంది ఉపాధ్యాయులు టీచర్ డైరీ పూర్తి చేయడం లేదని ఫిర్యాదు, తనిఖీ చేయాలని ఆదేశాలు

విషయం: స్పందన - విద్య ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠాలు బోధించే ముందు పాఠాలు ప్రణాళికను గానీ, దినచర్యల వివేదిక (డైరీ) గానీ రుపొందిందని, సకాలంలో సిలబస్ గానీ పూర్తి చేయని వందలాది మంది ఉపాధ్యాయులు - సూచనలు - ఇచ్చుట - గురించి.

newStone.in 

సూచిక: శ్రీ జంపాన శ్రీనివాసగౌడ, సామాజిక కార్యకర్త, గురజాడ, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా వారి లేఖ, తేది. 14/02/2022.

****

newStone.in

పై సూచిక నందు శ్రీ జంపాన శ్రీనివసగౌడ, సామాజిక కార్యకర్త, గురజాడ, పమిడిముక్కల మండలం వారు స్పందన ద్వారా, కృష్ణాజిల్లా లోని మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యర్ధినీ విద్యార్ధులకు పాఠాలు బోధించటానికి ఉపాధ్యాయులు తయారు చేసుకోవాల్సిన పాఠాల ప్రణాళికను గానీ, వారి దినచర్యల నివేదిక (డైరీ)లను గానీ రూపొందించటంలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పాఠ్యాంశాలు బోధించే సమయంలో ఉపయోగించవలసిన కృత్యాధార లేదా లెర్నింగ్ మెటీరియల్ ను చాలామంది ఉపాధ్యాయులు ఉపయోగించడంలేదని, అలాగే ప్రశ్నాపత్రాలు దిద్ది ప్రోగ్రెస్ కార్డులు క్రమం తప్పకుండా పరిశీలన నిమిత్తం తల్లిదండ్రులకు పంపని మరియు సకాలంలో సిలబస్ పూర్తి చేయని వందలాది మంది ఉపాధ్యాయులు ఉన్నారని ఫిర్యాదు చేసియున్నారు.

newStone.in 

కావున, జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు అందరూ పాఠశాలలను పాఠశాల విద్యా కమిషనరు/ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తరచూ సందర్శించి, తనిఖీ చేసి, పై అంశములు ఖచ్చితముగా జరుగుచున్నట్లు ధృవీకరించవలసినదిగా ఆదేశించడమైనది. ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకొండి.

[post_ads]

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad