Saturday, July 27, 2024
RRR Movie Another Trailer : ‘ఆర్ఆర్ఆర్’...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

RRR Movie Another Trailer : ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

RRR Movie Another Trailer : రిలీజ్ డేట్లు మారిపోయినా, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నారు మేకర్స్. అనుకోకుండా దొరికిన బ్రేక్‌ని టూ ఇంటిలిజెంట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారు. 

RRR Movie Another Trailer

సెకండ్ టైమ్ ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో డిజైన్ చేసుకుని తమ సినిమాల్ని సక్సెస్‌ దిశగా నడిపించుకుంటున్నారు. మరి.. జక్కన్న వ్యూహమేంటి. ట్రిపులార్ సెకండ్ ఫేజ్ ఎలా వుండబోతోంది…? కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనేది జక్కన్నకుండే మొండి ధైర్యం. సినిమా మేకింగ్ నుంచి ప్రమోషన్‌ దాకా దర్శకధీరుడికంటూ.. ఒక స్టయిల్ వుంటుందనేది క్లియర్. సంక్రాంతి సీజన్‌ని మిస్సయ్యామన్న చిన్న డిజప్పాయింట్ తప్పితే తన సినిమా మీద రాజమౌళి దగ్గర నైతిక స్థైర్యం తగ్గనే లేదు. కాకపోతే… ప్రమోషన్‌కి పెద్దగా టైమ్ లేదు. మార్చి లాస్ట్ వీకెండ్‌లోనే రాబోతోంది ట్రిపులార్ మూవీ. కేవలం రెండేరెండు వారాల్లో ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్‌ని ప్రమోట్ చేయడమంటే మాటలు కాదు. ఇద్దరు హీరోలతో మ్యూచ్యువల్‌గా చేసిన దోస్తీ పాట, ఇండివిడ్యువల్‌ ప్రమోషనల్ సాంగ్స్‌, బోనస్‌గా జననీ థీమ్ సాంగ్, ఫైనల్‌గా పవర్‌ఫుల్ ట్రైలర్… అన్నీ ఫస్ట్ ఫేస్‌లోనే బైటికొచ్చేశాయి. 

RRR Movie Another Trailer

అందుకే… ఫ్యాన్స్‌కి న్యూ ఫీల్ కలిగించే ఎక్స్‌ట్రా ప్రమోషనల్ స్టఫ్‌ కోసం కసరత్తు మొదలుపెట్టారు జక్కన్న. సెకండ్ ట్రయిలర్ రిలీజ్ చేసి, మోర్ అడ్వాంటేజ్ పొందిన భీమ్లా అండ్ రాధేశ్యామ్‌ సినిమాల స్ట్రాటజీ మీద కూడా ఓ కన్నేశారట. సినిమాలోని స్పెషల్ ఎలిమెంట్స్‌ని రీఇంట్రడ్యూస్ చేస్తూ కొత్తగా ఒక మినీ ట్రయిలర్‌ని రూపొందిస్తోంది ట్రిపులార్ టీమ్. చెర్రీ అండ్ అలియా మీద పిక్చరైజ్ చేసిన మరో పాటను కూడా దాచిపెట్టే వుంచారట. రిలీజ్‌డేట్‌కి వారం రోజుల ముందు జరిగే ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో ఈ పవర్‌ఫుల్ స్టఫ్‌ని బైటికొదిలే ఛాన్సుంది. రాధేశ్యామ్ సందడి ముగిసి, ఒక్కసారి డార్లింగ్ క్యాంప్‌ అంతా రెస్ట్ జోన్‌లోకి చేరిపోతే… జక్కన్న టీమ్‌ లైమ్‌లైట్‌లోకొచ్చేస్తుందన్నమాట.

RRR Movie Another Trailer : ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles