Trending

6/trending/recent

Emerging Careers: విద్యార్థులకు అలర్ట్.. ఈ కోర్సులతో మంచి భవిష్యత్.. తెలుసుకోండి

Emerging Careers మంచి డిమాండ్ ఉండే కోర్సులు, రంగాల గురించి వెతుకుతున్నారా? మీ కెరీర్ బాగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసం..

Emerging Careers

మార్కెట్లోకి రోజుకో కొత్త కోర్సు (New Course) వస్తోంది. అయితే ఏ కోర్సును ఎంచుకోవాలో తెలియక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. డిగ్రీ స్థాయిలో (Degree) విద్యార్థులు ఎంచుకునే కోర్సు ఆధారంగానే వారి భవిష్యత్ ఆధార పడుతుంది. ఆ సమయంలో సరైన కోర్సులో అడ్మిషన్ (Admission) పొందితే వారి భవిష్యత్ బంగారు మయం అవుతుంది. మన జీవితంలో మనం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడం. సాంకేతికతల రూపకల్పన, తయారీ, పర్యవేక్షణ మరియు నిర్వహణలో ఉపాధి రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల, ఈ అభివృద్ధి చెందుతున్న రంగాలలో పోటీపడేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి వివిధ కళాశాలలు తమ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అనుసరిస్తున్నాయి. రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉండే కోర్సులు, డిగ్రీల వివరాలు మీ కోసం..

1. Game design: ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో గేమింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. రోజుకో కొత్త గేమ్ మర్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గేమ్ డిజైనింగ్ కోర్సులకు సంబంధించిన డిగ్రీ చేసిన వారికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2.Data Science: ఇంటర్నెట్ సంచలనం సృష్టిస్తోన్న ఈ రోజుల్లో డేటా సైన్స్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 2026 కల్లా ఈ రంగంలో 27.9 శాతం ఉద్యోగాలు పెరిగే అవకాశం ఏర్పడింది. భవిష్యత్ లో టాప్ ఉద్యోగాలు ఈ రంగం నుంచే ఉండే అవకాశం ఉంది. కంప్యూటర్స్, మాథ్స్, అనలైటిక్స్ తదితర సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న వారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు.

3.సైబర్ సెక్యూరిటీ: అంతా ఆన్లైన్లోనే సాగుతున్న ఈ రోజుల్లో సైబర్ సెక్యూరిటీకి కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రముఖ సంస్థలు సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ కోర్సు చేసి అందులో ప్రావీణ్యం సాధించిన వారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది.

4.Pharmacology: ఫార్మకాలజీ అంటే డ్రగ్స్ గురించి అధ్యాయనం చేయడం, జీవచరాలపై అవి పని చేసే విధానాన్ని అధ్యాయనం చేసే శాస్త్రం. కరోనా పరిస్థితులు, కొత్త కొత్త వ్యాధులు పుట్టుకు వస్తున్న ఈ సమయంలో ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ కోర్స్ చేసిన వారికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సు చేసిన వారు ఫార్మసిస్ట్, ఫర్మకాలజిస్ట్, మెడికల్ రైటర్, ఫార్మాస్యూటికల్ సేల్స్ రిప్రజెంటేటీవ్ తదితర ఉద్యోగాలు చేసుకోవచ్చు.

5.Construction Management: ఈ రోజుల్లో నిర్మాణ రంగం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ రంగంలో వృద్ధి నిరంతరం కనిపిస్తూ ఉంది. కన్స్ట్రక్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన కోర్సులు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సులు చేసిన వారు కన్స్ట్రక్టర్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఎస్టిమేటర్, కన్స్ట్రక్టర్ ఇన్స్పెక్టర్, సివిల్ ఇంజనీర్ గా పని చేసే అవకాశం ఉంటుంది.

Emerging Careers: విద్యార్థులకు అలర్ట్.. ఈ కోర్సులతో మంచి భవిష్యత్.. తెలుసుకోండి


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad