Just In

6/trending/recent

Ads Area

DSC-2008 SGT Appointments within MTS : కాంట్రాక్టు పధ్ధతి లో ఎస్.జీ.టీ ల నియామకానికి ఆదేశాలు

DSC-2008 SGT Appointments within MTS : కాంట్రాక్టు పధ్ధతి లో ఎస్.జీ.టీ ల నియామకానికి ఆదేశాలు

DSC-2008 SGT Appointments within MTS

న్యూస్ టోన్,  ఇబ్రహీంపట్నం : 2008 డి ఎస్ సి సెలక్షన్ లో భాగంగా సెలక్షన్ లిస్ట్ లో మార్పుల వలన ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన పలువురు అభ్యర్థులకు ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే పలువురు అభ్యర్థులు పలు కారణాల రీత్యా సర్టిఫికెట్ వెరిఫికేషన్ హాజరు కాలేకపోయిన కారణంగా మరొక అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణన లోకి తీసుకున్న ప్రభుత్వం మిగిలిన అర్హత కలిగిన అభ్యర్థులతో కాంట్రాక్ట్ పద్ధతిన మినిమం టైం స్కేల్ తో ఈ నియామకాలు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

DSC-2008 SGT Appointments within MTS

ఇప్పటికే రెండువేల 193 పోస్టులకుగాను 1767 మంది కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు పొంది పని చేస్తూ ఉన్నారు. తాజా ఉత్తర్వులతో మిగిలిన 426 పోస్టులను తదుపరి అర్హత కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. గత పిఆర్సి ప్రకారం ఈ నియామకం పొందిన అభ్యర్థులు 21230 జీతం పొందుతూ ఉండగా, కొత్త పి.ఆర్.సి ప్రకారం 32,670 జీతం పొందన్నున్నారు. జీతం లో పెరుగుదల ఉన్న కారణంగా పలువురు అభ్యర్థులు ఈ నియామకాలు పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు.
DSC-2008 SGT Appointments within MTS : కాంట్రాక్టు పధ్ధతి లో ఎస్.జీ.టీ ల నియామకానికి ఆదేశాలు


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information