Saturday, July 27, 2024
Aided Teachers Absorption Web Counseling Schedule...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Aided Teachers Absorption Web Counseling Schedule Released : ఎయిడెడ్ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Aided Teachers Absorption Web Counseling Schedule Released : ఎయిడెడ్ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

Aided Teachers Absorption Web Counseling Schedule Released

న్యూస్ టోన్, అమరావతి : గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్న ఎయిడెడ్ ఉపాధ్యాయుల కల త్వరలో నెరవేరబోతోంది. ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలో కలుపుకునే దిశగా ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 

ఈ ప్రక్రియలో చివరిదశ అయినటువంటి వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 15వ తేదీన ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మారబోతున్నారు. సీనియార్టీ కి సంబంధించిన వివిధ అంశాలు ఇప్పటికే పూర్తయి ఉన్నందున స్వల్పకాలిక షెడ్యూల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. 

Aided Teachers Absorption Web Counseling Schedule

ఎయిడెడ్ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ క్రింద పేర్కొన్న విధంగా నిర్వహించబడుతుంది.

  • ఈనెల 8వ తేదీన సీనియారిటీ లిస్టు లను ప్రకటిస్తారు.
  • 9 వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఎయిడెడ్ ఉపాధ్యాయులు తాము వెళ్లాలనుకునే పాఠశాలకు సంబంధించిన ఆప్షన్స్ ను వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది.
  • ఉపాధ్యాయులు ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా ఈనెల 15వ తేదీన వారికి ఎలాట్ అయిన పాఠశాలలను ప్రకటిస్తారు.
  • ఈ ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక సహకారం ఏ.పి.సి.ఎఫ్ ఎస్.ఎస్ (APCFSS) నుండి విద్యాశాఖ తీసుకోనుంది.

ఎయిడెడ్ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉత్తర్వులను ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

[post_ads]
Aided Teachers Absorption Web Counseling Schedule Released : ఎయిడెడ్ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles