Trending

6/trending/recent

PRC Issue : ఉద్యోగులు లేకపోతే నేను లేను.. వారికి మంచి జరిగేలా చేస్తున్నాం

 AP CM JAGAN On PRC Issue : ఉద్యోగులు లేకపోతే తాను లేనని, వారికి మంచి జరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం జగన్. రిటైర్ అయిన తర్వాత కూడా వారికి మంచి జరిగేలా అడుగులు వేస్తున్నామని, ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి, 9 నెలల ఐఆర్ ను సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ. 5 వేల 400 కోట్ల భారం పడుతందన్నారు. రికరింగ్ వ్యయం రూపేణ హెచ్ఆర్ఏ వల్ల రూ. 800 కోట్లు, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, సీసీఏ రూపంలో రూ. 1330 కోట్లు.. కొత్త పీఆర్సీ వల్ల రూ. 11 వేల 500 కోట్ల భారం పడుతుందన్నారు. 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం ఉదయం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. హెచ్ఆర్ఏ రూపంలో అదనంగా మరో రూ. 325 కోట్ల భారం పడుతుందన్నారు.

ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఉద్యోగులకు మలరింత మంచి చేసేవాడినని, అర్థం చేసుకుని సహకరించినందుకు ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాన్నారు. రాబోయే రోజుల్లో సీపీఎస్ మీద గట్టిగా పని చేయడం జరుగుతుందన్నారు. భావోద్వేగాలకు తావివ్వవద్దని, సమస్యలుంటే చెప్పాలని వారికి సూచించారు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని, ఏ సమస్య ఉన్నా వారితో చెప్పుకోవచ్చన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామన్నారు. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దామన్నారు. పీఆర్సీ విషయంలో మంచి ఆలోచన వచ్చిందని, ఎక్కడా ఉద్యోగులు డిమాండ్ చేయలేదన్నారు. వారికి మేలు జరిగేలా చేస్తున్నట్లు, ఉద్యోగుల సహకారంతో మంచి పనులు చేయగలుగుతున్నామన్నారు సీఎం జగన్.

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పడింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలం అయిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈనెల 7నుంచి సమ్మె నిర్వహిస్తామన్న ఉద్యోగులు… ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘం నేతలు. అంతేకాదు… 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

PRC Issue : ఉద్యోగులు లేకపోతే నేను లేను.. వారికి మంచి జరిగేలా చేస్తున్నాం


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad