Saturday, July 27, 2024
Gold Silver Price Today : పసిడి...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Gold Silver Price Today : పసిడి పరుగులు, వెండి వెనకడుగులు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Gold Silver Price Today : పసిడి పరుగులు, వెండి వెనకడుగులు

Gold Silver Price Today : బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. 

పరుగులు పెడుతున్న పసిడి ధరలు – Gold Silver Price Today

బంగారం ధరలు ఎంత పెరిగినా ప్రతి రోజు బంగారం వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. షాపుల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. దేశంలో బంగారం ధరల్లో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. 

కొన్ని ప్రాంతాలలో పెరిగితే.. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగానూ, స్థిరంగా ఉంటాయి. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇక గురువారం (జనవరి 13)న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు మరింతగా పెరిగాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక వేళ తగ్గవచ్చు.. లేదా పెరగొచ్చు. తాజాగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో.. – Gold Silver Price Today

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 వద్ద ఉంది.
► ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,940 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,940 వద్ద కొనసాగుతోంది.
► ఇక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010 ఉంది.
► ఇక పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది.
► అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. – Gold Silver Price Today

► ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది.
► అలాగే ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది.
► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం మార్పులు చేర్పులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక రకాల కారణాలుంటాయి. 

పసిడి ధరలకు కారణాలు

అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

వెనకడుగు వేసిన వెండి – Gold Silver Price Today

Gold Silver Price Today : దేశంలో వెండి ధరల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే .. మరో రోజు పెరుగుతోంది. అయితే దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో వెండి ధర భారీగా పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతుంది. 

ఇక మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతుంటుంది. ఇక తాజాగా గురువారం హైదరరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కిలో బంగారంపై రూ.4,500 వరకు తగ్గుముఖం పట్టింది. అలాగే ఢిల్లీతో ముంబైలో రూ.4వేలకుపైగా పెరిగింది. 

వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. గురువారం (జనవరి 13)న వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.65,000 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.65,000 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, కోల్‌కతాలో రూ.65,000 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,000 ఉండగా, కేరళలో రూ.61,000 ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఇలా – Gold Silver Price Today

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, విజయవాడలో రూ.61,000 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles