Trending

6/trending/recent

UGC NET Phase II Exam Schedule 2021: విడుదలైన UGC NET పరీక్ష షెడ్యూల్.. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 UGC NET Phase II Exam Schedule 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC-NET డిసెంబర్ 2020 – జూన్ 2021 ఫేజ్ II పరీక్షల కోసం కొత్త టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది. ఈ పరీక్షలో హాజరైన అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌ని చూడండి. ఇందులో షెడ్యూల్‌ను తనిఖీ చేయవచ్చు. UGC NET డిసెంబర్- 2021 దశ II పరీక్ష డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 30 వరకు జరగాల్సి ఉంది. లేబర్ వెల్ఫేర్, సోషల్ వర్క్, ఒడియా , తెలుగుతో సహా మొదటి దశ I  రీషెడ్యూల్ చేసిన పేపర్‌లు డిసెంబర్ 30, 2021న నిర్వహించబడతాయి.

పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తామని, మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫేజ్ 1 పరీక్ష నవంబర్ 20, 21, 22, 24, 25, 26, 29, 30, డిసెంబర్ 1, 3, 4 మరియు 5 తేదీల మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించబడింది. UGC-NET ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తారు.

కరోనా కారణంగా పరీక్ష ఆలస్యమైంది

కరోనా దృష్ట్యా డిసెంబర్ 2020 UGC-NET వాయిదా వేయబడినందున, జూన్ 2021 UGC-NET షెడ్యూల్ ఆలస్యం అయింది. UGC-NET పరీక్షా చక్రాలను క్రమబద్ధీకరించడానికి, UGC యొక్క సమ్మతితో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), UGC-NET డిసెంబర్ 2020, జూన్ 2021 సైకిల్‌లను ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా వాటిని CBT మోడ్‌లో ఏకకాలంలో నిర్వహించవచ్చు.

కరోనా నిబంధనలు పాటించాలి

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించారు. కరోనా మార్గదర్శకాలతో పరీక్ష నిర్వహించబడుతుందని అభ్యర్థులు గమనించాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అభ్యర్థులు ఏదైనా సందేహాన్ని కలిగి ఉంటే వారు NTA హెల్ప్‌డెస్క్-011-40759000లో సంప్రదించవచ్చు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు జారీ చేసిన మార్గదర్శకాలను చదవాలని సూచించారు. పరీక్షకు కొన్ని రోజుల ముందు అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి.

UGC NET Phase II Exam Schedule 2021: విడుదలైన UGC NET పరీక్ష షెడ్యూల్.. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad