Trending

6/trending/recent

Black Currency: ఒక ఒరిజినల్ నోటుకు 4 బ్లాక్ కరెన్సీ నోట్లు.. గుంతకల్లులో నయా మోసం..

అనంతపురం జిల్లా గుంతకల్లు పరిసర ప్రాంతాల్లో బ్లాక్ కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను గుంతకల్లు టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు...

అనంతపురం జిల్లా గుంతకల్లు పరిసర ప్రాంతాల్లో బ్లాక్ కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను గుంతకల్లు టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 3,80,000 నగదు, 18 బ్లాక్ పేపర్ల కట్టలు, కారు, 3 సెల్ ఫోన్లు, కెమికల్ పూత పూసి బ్లాక్‎గా మార్చిన ఒరిజినల్ రూ. 500 రూపాయల బ్లాక్ నోట్లు మూడింటిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారి వివరాలను డీఎస్పీ నరసింగప్ప వెల్లడించారు. దాస నరేష్ కుమార్(33) కర్నూలు జిల్లా కోసిగి గ్రామం, k. దొరస్వామి రెడ్డి అలియాస్ చెన్నప్ప రెడ్డి(31) చిత్తూరు జిల్లా, జీడీ మండలం హెచ్చుపల్లి గ్రామం, పులుసు గోపాల కృష్ణ(32) కర్నూలు జిల్లా కోసిగి గ్రామానికి చెందినవాడిగా చెప్పారు.

ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్లో దాసరి నరేష్ కుమార్ ప్రధాన సూత్రదారి అని పోలీసు తెలిపారు. ఇతను మిగిలిన ఇద్దరు నిందితులను కలుపుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పారు. దాసరి నరేష్ కుమార్ D ఫార్మసీ చదివి అగ్రిగోల్డ్ ఏజెంట్‎గా పనిచేసేవాడు. కస్టమర్ల వద్ద అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోయాడు. ఈక్రమంలో రైస్ పుల్లింగ్ ముఠాలతో పరిచయాలు పెంచుకొని అక్రమంగా డబ్బు సంపాదించి చేసిన అప్పులు తీర్చాలని భావించాడు. కెమికల్స్ ఉపయోగించి బ్లాక్ కరెన్సీని ఒరిజినల్ నోట్లుగా మార్చవచ్చని… సదరు బ్లాక్ కరెన్సీ నోట్లును గోవా నందు రిజర్వ్ బ్యాంకు వారు నోట్లు ముద్రించే ఫ్యాక్టరీ నుంచి తెచ్చామని ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు గుంజేందుకు సిద్ధమయ్యాడు.

బ్లాక్ పేపర్లను నోట్లు సైజ్‎లో కట్ చేసి నోట్ల కట్టలుగా సిద్ధం చేసేవారు. ఈ కట్టల పైభాగంలో కెమికల్స్ పూసి బ్లాక్‎గా మార్చిన ఒరిజినల్ నోట్లను ఉంచేవారు. సిద్ధం చేసిన నోట్లను కెమికల్స్ ఉపయోగించి కడిగి ఒరిజినల్ కరెన్సీ నోట్లుగా మారినట్లు ప్రజలను నమ్మించే వారు. ఒక ఒరిజినల్ నోటుకు 4 బ్లాక్ కరెన్సీ నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి గుంతకల్లు పట్టణం, పరిసరాలలో ప్రజలను మోసం చేసి 3,80,000 రూపాయల నగదు కాజేశారు. డీఎస్పీ నరసింగప్ప పర్యవేక్షణలో టూటౌన్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో ASI-తిరుపాలు, కానిస్టేబుళ్లు రామాంజినేయులు, సునీల్, వీరాంజినేయులు, దూద్ పీరా ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. మోసాలకు పాల్పడుతున్న వారి ఆటకట్టిస్తున్నారు. ఇదే క్రమంలో పక్కా సమాచారంతో స్థానిక టి.వి స్టేషన్ సర్కిల్ వద్ద నిందితులను అరెస్టు చేశారు.

Black Currency: ఒక ఒరిజినల్ నోటుకు 4 బ్లాక్ కరెన్సీ నోట్లు.. గుంతకల్లులో నయా మోసం..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad