Trending

6/trending/recent

Beijing Winter Olympics : బీజింగ్ ఒలింపిక్స్ దౌత్యబహిష్కరణపై అమెరికాకు చైనా వార్నింగ్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధానిలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్​ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై జిన్ పింగ్ ప్రభుత్వం మండిపడింది. అమెరికా తన తప్పు

Beijing Winter Olympics : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధానిలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్​ను అమెరికా ప్రభుత్వం దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు  చేసిన ప్రకటనపై జిన్ పింగ్ ప్రభుత్వం మండిపడింది. దీనిపై మంగళవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ అమెరికా యొక్క తప్పుడు చర్యకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఝావో లిజియాన్..”అబద్ధాలు మరియు పుకార్ల ఆధారంగా సైద్ధాంతిక పక్షపాతంతో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో జోక్యం చేసుకోవడానికి అమెరికా చేసిన ప్రయత్నం (దాని) చెడు ఉద్దేశాలను మాత్రమే బహిర్గతం చేస్తుంది. వింటర్ ఒలింపిక్స్ రాజకీయ ప్రదర్శనలు మరియు పొలిటికల్ మ్యానుప్యులేషన్స్ కి వేదిక కాదు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో అమెరికా జోక్యం చేసుకుంటోంది మరియు అణగదొక్కే చర్యలు చేపడుతోంది. అమెరికా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది”అని అన్నారు.

కాగా, బీజింగ్‌ వింటర్‌ ఒలిపింక్స్‌ క్రీడలను అమెరికా దౌత్యపరంగా బహిష్కరించింది. దౌత్యపరమైన బహిష్కరణ అంటే… బీజింగ్‌లో జరిగే వింటర్‌ ఒలిపింక్స్‌, పారాలింపిక్‌ క్రీడలకు అధికారిక, దౌత్య ప్రతినిధులను ఎవరినీ అమెరికా పంపదు. అయితే, క్రీడల్లో అమెరికా ఆటగాళ్లు పాల్గొనున్నారు. చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లిం కమ్యూనిటీపై మానవహక్కుల ఉల్లంఘనలే బీజింగ్ బలింపిక్స్ దౌత్య బహిష్కరణకు కారణమని అమెరికా తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడే దేశాలతో తాము వ్యాపారాలు, సంబంధాలు పెట్టుకోమన్న సందేశాన్ని పంపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడన్ సర్కార్ తెలిపింది. కాగా,ఇంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అధికారంలో ఉన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో 1980లో చివరిసారిగా అమెరికా మాస్కో ఒలింపిక్స్‌ను పూర్తిగా బహిష్కరించింది.

ఇక,అమెరికా నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీసీ) పేర్కొంది. ఈ మేరకు దౌత్యవేత్తలు అయిన ప్రభుత్వ అధికారుల ఉనికి ప్రతి దేశ ప్రభుత్వానికి పూర్తిగా రాజకీయ నిర్ణయం అని అందువల్ల ఆయా దేశాల రాజకీయ తటస్థ వైఖరిని పూర్తిగా గౌరవిస్తాం అని ఐఓసీ ప్రతినిధి అన్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad