Trending

6/trending/recent

గడచిన 36 రోజుల్లో ఒకే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థుల మృతి... అందరూ ఒకే గ్రామంలో చదివే పిల్లలు

  • తెలియని కారణాలు.. ఆందోళనలో గ్రామస్థులు
  • 36 రోజుల్లో నలుగురు విద్యార్థుల మృతి

36 రోజుల వ్యవధిలో ఒకే గ్రామంలోని పాఠశాలలకు చెందిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరి కొంతమంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇందుకు కారణాలు తెలియక భయాందోళనతో గ్రామస్థులు బడులను మూసేయించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో చోటు చేసుకుంది. బోడిగూడెంలో జిల్లా పరిషత్తు పాఠశాలకు కాస్త దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ చదివే పదో తరగతి విద్యార్థి మెంటి మధు(15) జ్వర లక్షణాలతో రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. అంతకుముందు.. ఆరో తరగతి విద్యార్థి పేరిబోయిన రామాంజనేయులు(11) అక్టోబరు 30న, తొమ్మిదో తరగతి చదివే జక్కు శ్రీను(14) నవంబరు 25న, 8వ తరగతి విద్యార్థి కాటుబోయిన ప్రశాంత్‌(13) నవంబరు 26న మృత్యువాత పడ్డారు. ఈ బడులకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు జ్వర సంబంధిత లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల వరుస మరణాలకు స్పష్టమైన కారణాలు తెలియక గ్రామంలో ఆందోళన నెలకొంది. పరిస్థితులు చక్కబడే వరకు పాఠశాలలు నిర్వహించొద్దని     గ్రామస్థులు శనివారం విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు గ్రామంలో పర్యటించారు. అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో డెంగీ జ్వరాలుగా పేర్కొంటున్నప్పటికీ తమ పరిశీలనలో స్పష్టం కాలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నాయక్‌ తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రేణుక మాట్లాడుతూ పరిస్థితులు చక్కబడేంత వరకు పాఠశాలలు మూసేయడం తగదన్నారు. విద్యార్థులను బడులకు పంపించే విషయమై తల్లిదండ్రులు పునరాలోచించాలని సూచించారు.

36 రోజుల్లో నలుగురు విద్యార్థుల మృతి అందరూ ఒకే గ్రామంలో చదివే పిల్లలు


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad