Trending

6/trending/recent

TTD: మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే..

 తిరుమల తిరుపతి దేవస్థానం మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరుప‌తి న‌గ‌రంలో నవంబర్ 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పింది. ఈ కారణంగా నవంబ‌ర్ 12, 13 14వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

తిరుమల స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ట్, తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ దర్శకుడు గోపీచంద్ దర్శించుకున్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad