Trending

6/trending/recent

PM Modi: కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలతో కలసి పనిచేయండి.. అధికారులతో ప్రధాని మోడీ

 PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై అత్యవరసరంగా సమావేశం నిర్వహించారు. 

అయితే కరోనా థర్డ్‌ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సౌతాఫ్రికా వేరియంట్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా కంటే ఈ న్యూ వేరియంట్‌ మరింత ప్రమాదకరమైనదని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కొత్త వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో ప్రకంపనలు సృష్టించడంతో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రినింగ్‌, పరీక్షలను కఠినతరం చేయాలని భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలను కోరింది. ప్రధాని నిర్వహించిన అత్యవసర సమావేశంలో క్యాబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా, ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌, నీతి అయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ పాల్గొన్నారు.

టీకా డ్రైవ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో ప్రతి ఒక్కరు టీకా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫస్ట్‌ డోస్‌, సెకండ్‌ డోస్‌ పూర్తి చేసుకున్న వారు ఎంత మంది ఉన్నారో వివరాలు తెలుసుకున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ను గుర్తించిన తర్వాత శ్రీలంక ఆదివారం నుంచి ఆరు దక్షిణాఫ్రికా దేశాల నుంచి చాలా మంది ప్రయాణికుల ప్రవేశాన్ని నిషేధించినట్లు అధికారులు మోడీకి తెలిపారు. అయితే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, కరోనా వ్యాప్తిపై మోడీ ఆరా తీశారు. కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మోడీ అధికారులను ఆదేశించారు. అయితే కొత్త వేరియంట్‌ B.1.1.1.529 గురించి పరిశీలించాలని, దేశంలో కూడా వ్యాప్తి చెందే అవకాశాలుండటంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


నిఘా ఉంచాలి.. 

దేశంలో కరోనా పరీక్షలను పెంచాలని ప్రధాని నరంద్రమోదీ అధికారులకు సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచాలని సూచించారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో ఈ వేరియంట్‌‌పై అవగాహన కల్పించేలా.. కేంద్ర అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధిక కేసులు నమోదయ్యే క్లస్టర్లలో ఇంటెన్సివ్ కంటైన్‌మెంట్, నిఘా వ్యవస్థను కొనసాగించాలని, ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. వైరస్ వెంటిలేషన్, గాలి ద్వారా సంక్రమించే అంశాలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పీఎం పేర్కొన్నారు. ప్రజలంతా కూడా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి..

కొత్త ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు తాము సులభతర విధానాన్ని అనుసరిస్తున్నట్లు ప్రధానికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వివిధ ఔషధాల బఫర్ స్టాక్‌లు తగినన్ని ఉండేలా రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పీడియాట్రిక్ సౌకర్యాలతో సహా వైద్య మౌలిక సదుపాయాల పనితీరును సమీక్షించడానికి రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్లను పెంచాలని, దీనిపై రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని పీఎం మోదీ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు.

అయితే అంతర్జాతీయ పర్యాణికులందరి నమూనాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌పై ఆరోగ్య మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగం ఇప్పటికే పరిస్థితిని సమీక్షిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైనది కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమ్రికాన్‌ వేరియంట్లపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. ఈ వేరియంట్‌లో 32 మ్యూటేషన్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad