Saturday, July 27, 2024
Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్ట్.....

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్ట్.. అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు.. సిద్ధంగా ఉండాలని లేఖ!

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Omicron COVID-19 variant: ప్రపంచవ్యాప్తంగా మరోసారి దడపుట్టిస్తు్న్న కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు అయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర సర్కార్ లేఖ రాసింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ వేరియంట్‌ వెలుగుచూసిన దేశాలను ఇప్పటికే ‘రిస్క్’ కేటగిరిలో పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాలను భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరిస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ధక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్ వానా, జాంబియా, లెసాతో, జింబాబ్వే దేశాలకు వెళ్లొద్దని తమ పౌరులకు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో ఓమిక్రాన్ వేరియంట్‌పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దాని వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా అన్ని ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఓమిక్రాన్‌పై అలర్ట్ ఉండాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు అందాయి. మరోవైపు, గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Union Health Secretary Rajesh Bhushan writes to all States/UTs over the #Omicron variant of COVID19, asks them to enforce intensive containment & active surveillance measures and also increase coverage of vaccination pic.twitter.com/5qxAHYhZtH

— ANI (@ANI) November 28, 2021

ఓమిక్రాన్ రకం కరోనా వైరస్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్, వారి కదలికిలపై నిఘా, కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం సహా కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి అధికమైతే అందుకు తగ్గట్లుగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల కిట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక టెస్టింగ్ సదుపాయాలను రాష్ట్రాలు దగ్గర పెట్టుకోవాలి.

హాట్‌స్పాట్‌లను గుర్తించడం తప్పనిసరి. ఎక్కువ కేసులు వచ్చిన క్లస్టర్‌ను గుర్తించి దానిని హాట్‌స్పాట్‌గా ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా టెస్టింగ్ చేయడం, పాజిటివ్ శాంపిళ్లను ఇన్సాకాగ్‌ పరిశోధనశాలకు పంపిచాలి. ఆ ప్రాంతంలో పాజిటివి రేటు ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం కూడా కీలకం. ఆరోగ్య సేవలను అందించడంలో ఏ మాత్రం ఆలస్యం కాకూడదు. దేశంలోని వేరియంట్లను గుర్తించేందుకు ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలను స్థాపించింది ప్రభుత్వం. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. కొవిడ్ వేరియంట్లపై తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించాలి. వ్యాక్సినేషన్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇంటెన్సివ్ కంటైన్మెంట్, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలంటూ రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. అవసరమైతే కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆదేశించింది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు ఫోకస్ పెట్టాలి

కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలన్న కేంద్రం.. తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలను కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని తెలిపింది. అలాగే, తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని కేంద్రం సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles