Trending

6/trending/recent

Petrol, Diesel Price Hike: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

 Latest Petrol Diesel Prices: దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా మండిపోతుండంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆదివారం కూడా పెట్రో ధరలు పెరిగాయి. మరోసారి ధరలను పెంచుతూ చమురు సంస్థలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న ధరలను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ.. ధరలు పెరగడం సర్వసాధారణంగా మారింది. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు ఆదివారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి.

మెట్రో నగరాల్లో ధరలు ఇలా..

  • దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.109.34, డీజిల్‌ ధర రూ.98.07 కి పెరిగింది.
  • ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.115.15, డీజిల్‌ రూ.106.23 కి చేరింది.
  • చెన్నైలో పెట్రోల్‌ రూ.106.04 కి చేరగా.. డీజిల్‌ రూ.102.25కి పెరిగింది.
  • కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.109.79 కి పెరగగా.. డీజిల్‌ రూ.101.19 కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసల చొప్పున పెరిగింది. దీంతో భాగ్యనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.72కు చేరగా, డీజిల్‌ రూ.106.99కి పెరిగింది. ఏపీలోని విజయవాడలో పెట్రోల్ ధర 115.94కి చేరగా.. డీజిల్ ధర 108.55 కి ఎగబాకింది.

దేశీయ పెట్రోలియం సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి. దీని ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారి అమలులోకి వస్తాయి.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad