Saturday, July 27, 2024
COVID-19 Alert: మళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు..

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

COVID-19 Alert: మళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు..

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • మళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు..
  • బెంగాల్‌, అస్సాంలలో 41 శాతం కేసుల పెరుగుదల..

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వారపు పాజిటివిటీ రేటులోనూ పెరుగుదల నమోదవుతుండటంతో పాటు కరోనా పరీక్షలు తగ్గుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. కట్టుదిట్టంగా కొవిడ్‌ నిబంధనలను అమలు చేయాలని, కరోనా పరీక్షలు పెంచాలని సూచించింది. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. అస్సాంకు రాసిన లేఖలో.. అక్టోబరు 20-26 తేదీల మధ్య 41 శాతం కొవిడ్‌ కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. గత 4 వారాలుగా (ఈనెల 25 నాటికి) పాజిటివిటీ రేటు కూడా 1.89% నుంచి 2.22%కి పెరిగినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు.. సెప్టెంబరు 28 – అక్టోబరు 4 వారంలో 1,64,071 నిర్వహించగా ఆ సంఖ్య అక్టోబరు 19-25 వారానికి 1,27,048కి తగ్గిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. బెంగాల్‌లో గత వారం రోజుల్లో 41 శాతం కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. 4 వారాల్లో పాజిటివిటీ రేటు 1.93 శాతం నుంచి 2.39 శాతానికి పెరిగిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇక్కడ కూడా కరోనా పరీక్షలు తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తగిన విధంగా కంటెయిన్‌మెంట్‌ జోన్లను నిర్వహించాలని.. వీటి పరిధిలో ఇంటింటికీ వెళ్లి కేసులను గుర్తించాలని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles