Trending

6/trending/recent

Compassionate Appointments : కారుణ్య నియామకాలపై త్వరగా చర్యలు తీసుకోవాలి: సీఎస్‌ సమీర్‌శర్మ

  • నవంబరు 30లోగా కోవిడ్ కారుణ్య నియామకాలు పూర్తి చేయాలి
  • రాష్ట్ర సచివాలయం మొదలు గ్రామస్థాయి వరకూ ఇ-ఆఫీసు విధానం అమలు చేయాలి
  • ఇకపై ప్రతినెల మొదటి బుధవారం కార్యదర్శుల సమావేశం
  • కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలి కోర్టు తీర్పులను సత్వరం అమలు చేయాలి
  • ఉద్యోగుల పదోన్నతులకు డిపిసి కేలండర్ల ప్రకారం చర్యలు తీసుకోండి
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ

అమరావతి,21 అక్టోబరు:రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలను నవంబరు 30వతేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.గురువారం  అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో ప్రధానంగా మంత్రివర్గ సమావేశాలల్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్నచర్యల నివేదిక(Action Taken Report),వివిధ శాఖలకు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు,సాధించిన ఫలితాలు,కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్లు దాఖలు,కోర్టు తీర్పులు సత్వర అమలు,రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పధకాలకు కేంద్రం నుండి సకాలంలో నిధులు రాబట్టడం,నూతన ప్రతిపాదనలు సమర్పించడం తదితర అంశాలపై సిఎస్ డా.సమీర్ శర్మ కార్యదర్శులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నవంబరు 30వతేదీ లోగా కోవిడ్ తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.ఇందుకు సంబంధించిన సర్కులర్ ఆదేశాలను జారీ చేశామని దీనిపై సంబంధిత శాఖాధిపతులు సత్వర చర్యలు తీసుకునేలా కార్యదర్శులు చూడాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.ఇక మీదట ప్రతినెలా మొదటి బుధవారం కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని సిఎస్ పేర్కొన్నారు.

రాష్ట్ర సచివాలయం మొదలు గ్రామ స్థాయి వరకూ ఇ-ఆఫీస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.అదేవిధంగా ఒక అంశానికి సంబంధించిన ఫైలు క్షేత్రస్థాయి కార్యాలయం మొదలు రాష్ట్ర సచివాలయం వరకూ ఒకే నంబరుతో నిర్వహించేలా చూడాలని దీనిపై జిల్లా కలక్టర్లకు కొన్ని యూనిక్ నంబర్లను రూపొందించి పంపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటి శాఖ ముఖ్యకార్యదర్శిని సిఎస్ ఆదేశించారు.ఈప్రక్రియను వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుని రెండు వారాల్లో దీనిపై ప్రగతి నివేదికను సమర్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

వివిధ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డిపిసి(డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ)కేలండర్ల ప్రకారం సకాలంలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పధకాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధులను సకాలంలో రాబట్టేందుకు,వివిధ నూతన పధకాలు, కార్యక్రమాలకు సంబంధించి కేంద్రానికి సకాలంలో ప్రతిపాదనలు సమర్పించేందుకు ఆయా శాఖల కార్యదర్శులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కోర్టు కేసులకు సంబంధించి మాట్లాడుతూ సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలని,కోర్టులు ఇచ్చే తీర్పులను జాప్యం లేకుండా సకాలంలో అమలు చేయాలని సిఎస్ డా.సమీర్ శర్మ కార్యదర్శులకు స్పష్టం చేశారు.ఇంకా ఈసమావేశంలో అజెండాకు సంబంధించిన ఇతర అంశాలపై సిఎస్.డా.సమీర్ శర్మ మాట్లాడుతూ కార్యదర్శులకు తగిన దిశానిర్దేశం చేశారు.

ఈసమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు వారి శాఖల అంశాలకు సంబంధించి తీసుకుంటున్నచర్యలను సిఎస్ కు వివరించారు.ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్ చంద్ర, పూనం మాలకొండయ్య, ప్రవీణ్ కుమార్,అజయ్ జైన్,కరికల వల్లవన్,పలువురు ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు తదితర అధికారులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad