Trending

6/trending/recent

Compassionate Appointments: కారుణ్య నియామకాలు-విధి విధానములు - ముఖ్యాంశాలు

Compassionate Appointments: కారుణ్య నియామకాలు-విధి విధానములు - ముఖ్యాంశాలు

సాంఘిక సంక్షేమ ప్రక్రియ క్రింద కారుణ్యనియామక పథకం పలు ఉత్తర్వుల ద్వారా నియమ నిబంధనలు రూపొందించి ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. అలాంటి ఉత్తరువులు జారీ చేయటంలో ప్రభుత్వ సంకల్పం, సర్వీసులో వుంటూ అకాల మరణానికి గురియైన సందర్భంలో, అంతవరకు అతని ఆర్జనపై ఆధారపడి జీవిస్తున్న భార్య/భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులకు గురి అయి, జీవితం సాగించటానికి యాతనలు పడవలసిన దుర్భర స్థితి కలుగవచ్చు.

కాబట్టి, అట్టి స్థితిలో వారిలో అర్హతలు కలిగిన వారిలో ఒకరికి, కారుణ్యంతో ఉద్యోగం కల్పించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవటం అవసరమనే సంకల్పం.

సాధారణంగా ఒక వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే, ఎ.పి. స్టేట్‌ మరియు సబార్దినేట్‌ సర్వీసులు 1996లో తెలిపిన నియమ నిబంధనల మేరకు ఎంపిక ప్రక్రియ చేపట్టవలసి యుంటుంది. సర్వీసు కమీషన్‌ ద్వారా గాని, జిల్లా సెలెక్షన్‌ కమిటీ ద్వారా గాని, లేక ఎంప్లాయమెంట్‌ ఎక్సేంజ్‌ ద్వారా గాని ఎంపిక ప్రక్రియ చేయవలసి వుంటుంది. ఇలాంటి ప్రక్రియ చేపట్టటం ఆలస్యానికి కారణమవుతుంది. అంతవరకు మరణించిన కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా తక్షణ శాశ్వత పరిష్కారం కల్పించాలనే సదుద్దేశంతో వారిలో ఒకరికి ఉద్యోగం కారుణ్య రీత్యా కల్పించి
ఆదుకోవాలని, ఇంతకు ముందే జారీ చేసిన ఉత్తరువులు రద్దు చేస్తూ, మరికొన్ని సౌలభ్యాలతో ఉత్తరువులు జారీ చేశారు.

అటు తర్వాత కాలానుగుణంగా విభిన్న అంశాలపై నియమ నిబంధనలకు మార్పులు, చేర్పులు, వివరణలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. అట్టి ప్రభుత్వ ఉత్తరువులు అంశాలవారీగా తదుపరి అధ్యాయాలలో వివరంగా ఈ క్రింది ఫైల్ డౌన్లోడ్ చేసి తెలుసుకొండి.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad