Trending

6/trending/recent

AP PRC Fitment: పీఆర్‌సీ నివేదికలో 27% ఫిట్‌మెంట్‌?

  • పీఆర్‌సీ నివేదికలో 27% ఫిట్‌మెంట్‌?
  • 18, 19న సీఎస్ బేటీ!
  • పీఆర్సీ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి

న్యూస్ టోన్, అమరావతి: AP PRC Fitment: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి 11వ వేతన సవరణ కమిషన్‌ 27% ఫిట్‌మెంటును సిఫార్సు చేసిందా? అది అంతే మొత్తమని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు 11వ వేతన సవరణ కమిషన్‌ నివేదికను అమలు చేయాల్సి ఉంది. అశుతోష్‌ మిశ్ర ఏకసభ్య ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిషన్‌ గతేడాది అక్టోబరు 5న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వేతన సవరణ కమిషన్‌ నివేదిక సమర్పణ ఎంతో హడావుడిగా జరుగుతుంది. ముఖ్యమంత్రికి నేరుగా కమిషన్‌ తన నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో వారు విలేకర్లతోనూ మాట్లాడతారు. ఈ కమిషన్‌ కరోనా సమయంలో నివేదిక సమర్పించాల్సి వచ్చింది. దీంతో ఛైర్మన్‌ అశుతోష్‌ మిశ్ర రాకుండానే నివేదికను వారి కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆ నివేదిక అందింది. ఇంతవరకూ ప్రభుత్వం నివేదికను బయటపెట్టలేదు. సాధారణంగా ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్‌ ఇస్తారనేది ఆసక్తికరం. వీలైనంత ఎక్కువ మొత్తం సాధించుకునేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చిస్తాయి.

సీపీఎస్ రద్దు, పీఆర్సీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు తదితర అంశాలను ప్రస్తావించినట్లు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నెట్వర్క్ ఆస్పత్రులతో సమావేశం ఏర్పాటు చేసి హెల్త్ కార్డు ద్వారా ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. 45 రోజుల్లోనే కారుణ్య నియామ కాలు ఇవ్వాలని కోరగా సానుకూల నిర్ణయం తీసు కుంటామని చెప్పారన్నారు. జాయింట్ స్టాఫ్ కౌ న్సిల్ సమావేశం ఈ నెల 17, 18వ తేదీలలో జరుగుతుందన్నారు. పీఆర్సీపై ఈ నెల 18, 19వ తేదీల్లో ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమావేశాన్ని నిర్వహించి చర్చించే అవకాశం ఉందన్నారు.

అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చిం చి 11వ పీఆర్సీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హామీ లభించిందని ఏపీ ఎన్జీ వోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలి పారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లా డారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పొడిగించేందుకు అంగీకరించారని, సమస్యలను సత్వరమే పరిష్క రిస్తామని సీఎంవో నుంచి హామీ లభించిందని తెలిపారు. జేఏసీల తరపున ప్రభుత్వానికి ధన్య వాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే రెండు జేఏసీలు కృషి చేస్తాయని, సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఫిట్మెంట్ సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సీఎం అదనపు కార్యదర్శి కె.ధనంజయరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం వోలో ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చించి తాము ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగుల సహకారం మరువలేనిదని, కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తామని చెప్పారన్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad