Saturday, July 27, 2024
పత్రికా ప్రకటన: AP JAC Press...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

పత్రికా ప్రకటన: AP JAC Press note మరియు AP JAC అమరావతి ఐక్యవేదిక

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • 11 వ PRC నివేదికను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ముందే అందజేయాలి…బండి శ్రీనివాస్& బొప్పరాజు
  • ఆర్ధిక మరియు అర్డికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలి… బండి శ్రీనివాసరావు, బొప్పరాజు

AP JAC Pressnote: ఇరు JAC ల ఐక్యవేదికతో తేదీ 13/10/21 న గౌరవ శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, CMO ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు అనగా 21 వ తేదీన అందరూ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే ఈ నెల 27 వ తేదీన అన్నీ సంఘాలతో రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషం.

ఈరోజు 21/10/21 న జరుగుతున్న సెక్రెటరీస్ సమావేశంలో చర్చించటానికి ముందుగా, AP JAC, AP JAC అమరావతి ల ఐక్యవేదిక పక్షాన 49 (నలభై తొమ్మిది) డిమాండ్స్ తో కూడిన మెమొరాండం గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి అందచేసినాము. 

ఈ నెల 27 వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో ప్రధానంగా ఆర్థిక పరమైన ఆంశాలు చర్చకు తెస్తామని…ప్రధానంగా ప్రతి నెల ఒకటవ తేదీనే పెన్షన్లు, జీతాలు ఇవ్వాలని, మేము దాచుకున్న, మాకు రావాల్సిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని, అలాగే 11వ PRC నివేదికకు తక్షణమే బహిరంగపరచాలని, అనేక శాఖాలకు సంబంధించిన ఆర్ధిక పరమైన సమస్యలు చాలా కాలం నుండి పరిష్కారం కాలేదని, ఖచ్చితంగా ఆర్థిక శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాము. 

అదేవిధంగా CPS రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దికరణ, DA బకాయిల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల పెంపుదల, పెన్షనర్స్ కు రావలసిన ఆర్థిక పరమైన అంశాలు పరిష్కరించాలని కొరాము.

వీటిపై స్పందించిన గౌరవ చీఫ్ సెక్రటరీ గారు తప్పకుండా ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామని, అలాగే 11వ PRC, ఆర్థికపరమైన అంశాలపై కూడా చర్చిస్తామని తెలిపారు.

చీఫ్ సెక్రటరీ గార్ని కలసిన వారిలో

AP JAC సెక్రటరీ జనరల్ జి హృదయరాజు, AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై వి రావు, AP NGO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KV శివారెడ్డి, ఏపీ జెఏసి కో – ఛైర్మన్: కె యస్ యస్ ప్రసాద్,ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు DS కొండయ్య, మున్సిపల్ మినిస్టీరియల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

-బండి శ్రీనివాసరావు & బొప్పరాజు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles