Trending

6/trending/recent

JVK Kit Latest Instructions: జగనన్న విద్యా కానుక తాజా మార్గదర్శకాలు 05.08.2021

రాష్ట్రపథక సంచాలకులు, సమగ్రశిక్షా, ఆంధ్రప్రదేశ్‌ వారి కార్యావర్తనములు

ప్రస్తుతం: శ్రీమతి వెట్రిసెల్వి ఐ.ఎ.ఎస్‌..

ఆర్‌.సి.నెం.SS-16021 తేది: 05/08/2021

విషయం: సమగ్రశిక్షా 'జగనన్న విద్యా కానుక 2021-22 - మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్‌ కాంప్లెక్సులకు యూనిఫాం క్లాత్‌ - బూట్లు సాక్సులు మరియు బ్యాగులు సరఫరా - సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.

నిర్దేశాలు: 1 ) ఆర్‌.సి.నెం. 55-16021/3/2021-06110 5౬6-555 తేది: 07-06.2021 న. ఆదేశములు

Order:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2021- 22 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్ధులకు సమగ్రశిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్‌ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం మండల రిసోర్సు కేంద్రాలకు చేరిన యూనిఫాం, బూట్లు & సాక్సులు, బ్యాగులు వంటి వాటిని చేరిన ఒకటి రెండు రోజుల్లో స్కూల్‌ కాంప్లెక్సులకు సరఫరా చేయవలసి ఉంటుంది.

* మండల విద్యాశాఖాధికారులు తమ మండల రిసోర్సు కేంద్రానికి యూనిఫాం/ బూట్లు ఈ& సాక్సులు మరియు బ్యాగులు చేరిన ఒకట్రెండు రోజుల్లో స్కూల్‌ కాంప్లెక్సులకు చేర్చేలా ప్రణాళిక వేసుకోవాలి. నిర్దీత తేదీలు కేటాయిస్తూ తమ పరిధిలోని స్కూల్‌ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించాలి.

* మండల విద్యాశాఖాధికారులు “జగనన్న విద్యాకానుక" యాప్‌ లో పొందుపరిచిన సమాచారం మేరకు ఆయా స్కూల్‌ కాంప్లెక్సులకు చెందిన తరగతి వారీగా బాలబాలికలకు ఏయే వస్తువులు ఎన్నెన్ని ఇవ్వవలసి ఉంటుందో సరిచూసుకొని సరఫరా చేయాలి.

* ఎంఆర్సీ/ స్కూల్‌ కాంప్లెక్సులలో వస్తువులు పంపిణీ కోసం టేబుళ్లు, కుర్చీలు, డిస్‌ ప్లే బోర్డు, మార్కర్లు, స్టాప్లర్‌, శానిటైజర్‌, దుస్తులు కొలిచే టేపు/ స్కేలు వంటివి అవసరానికి అనుగుణంగా ఉపయోగించాలి.

ఎంఆర్సీల నుంచి స్కూల్‌ కాంప్లెక్సులకు యూనిఫాం క్షాత్‌, బూట్లు & సాక్సులు మరియు బ్యాగుల సరఫరా విధానం

* ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమష్టి బాధ్యతగా భావించాలి.

పూర్తి వివరాలు ఈ ఫైల్ లో చూడగలరు....

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad