Trending

6/trending/recent

Third wave: అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు

అమరావతి: రాష్ట్రములో కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందోస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది.

చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్‌ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి ఏపిఐఐసి భవనం 6ఫ్లోర్‌ లోని కాన్ఫరెన్స్‌ హల్‌ లో మంగళవారం కోవిడ్‌ నివారణ గ్రూప్‌ అఫ్‌ మిమిస్టర్స్‌ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కమిటీ కన్వీనర్‌ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో చిన్నారులకు వైద్య చికిత్స అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. 5సంవత్సరాల లోపు తల్లులకు టీకా వేసే కార్యక్రమం ముమ్మరం చేయాలని అన్నారు. థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్‌ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలని వారు తెలిపారు. థర్డ్‌ వేవ్‌ లో అవసరమైన అన్ని రకాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలుకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని హాస్పిటల్స్‌ లో బెడ్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కమిటీ సభ్యులు, మంత్రులు బత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్‌ రెడ్డి, కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకఅష్ణ రెడ్డి, డాక్టర్‌ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad