Trending

6/trending/recent

Teacher held: పాఠాలు బోధించాల్సి ఉపాధ్యాయుడు వెకిలి మాటలు.. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో అసభ్యకర సందేశాలు.. చివరికి కటకటాలపాలైన టీచర్!

 Teacher held for obscene calls: పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే మదమెక్కి ప్రవర్తించాడు. వారికి సెల్‌ఫోన్‌లో బూతు బొమ్మలను చూపించి మరీ లైంగిక వేధింపులకు గురి చేశాడు. టీచర్ చేసే వికృత చేష్టల గురించి ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అటు అతని వేధింపు భరించలేక కుమిలిపోయింది ఓ విద్యార్థి. చివరికి విసిగి వేసారిన బాలికి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ ప్రబుద్ధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో లైంగిక వేధింపులు చేసిన ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సోచట్టం కింద అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా, ముదుగళత్తూరులోగల పల్లివాసల్‌ ఉన్నత పాఠశాల లో సైన్స్‌ టీచర్‌గా హబీబ్‌ మహ్మద్‌ (36) పనిచేస్తున్నాడు. ఇతను 9, 10 తరగతి విద్యార్థినులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తూ వచ్చాడు. దీంతో వారి సెల్‌ఫోన్‌ నెంబర్లకు విడిగా ఫోన్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనకు అనుకూలంగా వ్యవహరించనట్లయితే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించినట్లు సమాచారం.

ఇటీవల లైంగిక వేధింపుల కేసులో చెన్నై పద్మాశేషాద్రి పాఠశాల రాజగోపాలన్‌ అరెస్టు కావడంతో అప్రమత్తమైన ఓ విద్యార్థిని హబీబ్‌ మహ్మద్‌ చర్యల గురించి తన తల్లిదండ్రులకు తెలిపింది. అదే సమయంలో విద్యార్థినితో ఉపాధ్యాయుడి సంభాషణ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో వయసుతో వచ్చే ఆశలను అణుచుకోకూడదని, పుస్తకం తీసుకుని తన ఇంటికి వస్తే పాఠం బోధిస్తానని అంటూ అసభ్య పదజాలం ఉపయోగించిన అయ్యగారి భాగోతం వెలుగులోకి వచ్చింది. దీనిగురించి విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదుగళత్తూరు పోలీసులు ఉపాధ్యాయుడు హబీబ్‌ మహ్మద్‌ను అరెస్ట్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

తొమ్మిదేళ్లుగా పాఠశాలలో సేవలందించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సత్య మూర్తి తెలిపారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామనాథపురం పోలీస్ సూపరింటెండెంట్ ఇ కార్తీక్ అన్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad