Trending

6/trending/recent

Pregnant Women: గర్భిణులు పారసిటమాల్‌ వాడితే.. పుట్టే పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం?.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Pregnant Women:  గర్భం దాల్చడం అనేది స్త్రీకి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. అయితే స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత తన ఆరోగ్యం విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటారు.

గర్భం దాల్చడం అనేది స్త్రీకి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. అయితే స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత తన ఆరోగ్యం విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటారు.

వైద్యులు కూడా గర్బిణీలకు.. ఆహారం, ఇతర విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతుంటారు. అయితే గర్బిణులు తీసుకునే మెడిసిన్‌పై పలు అధ్యాయానాలు జరుగుతున్నాయి.

తాజాగా గర్భిణీలు పారసిటమాల్‌ మాత్రలను వాడితే వారికి జన్మించే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందా అనే అంశంపై జరిగిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ అధ్యయనం గురించి యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురితమైంది. ఈ అద్యయనానికి స్పెయిన్‌లో బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ నాయకత్వం వహించింది. ఇందరకు లా కైక్సా ఫౌండేషన్ సపోర్ట్‌గా నిలిచింది.

ఈ అధ్యయనంలో ఐరోపా దేశాలకు చెందిన 70వేల మందికిపైగా పిల్లల ఆరోగ్య నివేదికలను సేకరించి విశ్లేషించారు.

కొందరు గర్భిణులు పారసిటమాల్‌ను వాడటం వల్ల వారికి పుట్టిన పిల్లల్లో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) (లేదా) ఆటిజం స్పెక్ట్రమ్‌ కండిషన్స్‌ (ఏఎ్‌ససీ) అనే సమస్య ను గుర్తించినట్టు తెలిపారు.

గర్భిణీలు పారసిటమాల్ వాడకంపై గతంలో వెలువడిన పరిశోధన ఫలితాలతో మేము ఏకీభవిస్తున్నామని ఈ అధ్యయనం నిర్వాహకులు తెలిపారు. గర్భిణీలు కేవలం అత్యవసరమైనప్పుడు మాత్రమే పారసిటమాల్‌ను వాడాలని సూచించారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad