Trending

6/trending/recent

LPG Gas Connection: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాగంటే..!

 LPG Gas Connection: మీరు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా.? 

అయితే మీకో గుడ్‌న్యూస్‌. మీకు బీపీఎల్‌ కార్డు ఉంటే ఉచితంగానే గ్యాస్‌ కనెక్షన్‌ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచే కోటి ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి 1 నాటి బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగానే మరో కోటి కొత్త గ్యాస్‌ కనెక్షన్లను అందిస్తామని ప్రకటించారు. ఇది ఇంకా అమలు కాలేదు. తాజా నివేదికల ప్రకారం చూస్తే.. ఈనెల నుంచే ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే చాలా మంది పేదలకు ఎంతో మేలు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద 2021 జనవరి చివరి నాటికి 8.3 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు అందించినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందలు పడుతున్నవారికి మూడు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందించింది. అయితే ఉజ్వల స్కీమ్‌లో చేరిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా ఉచితంగా సిలిండర్లు అందించింది.

కొత్తగా గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ కోసం..

అయితే కొత్తగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటే.. రూ.3,200 ఖర్చు అవుతుంది. అయితే మీరు ఉజ్వల స్కీమ్ కింద ఎల్‌పీజీ కనెక్షన్ పొందితే రూ.1600 సబ్సిడీ వస్తుంది. కేంద్రం ఈ డబ్బులు చెల్లిస్తుంది. ఇక మిగిలిన రూ.1600 ఆయిల్ కంపెనీలు అందిస్తాయి. అయితే కస్టమర్లు ఈఎంఐ రూపంలో ఈ 1600 తర్వాత ఆయిల్ కంపెనీలకు చెల్లించాలి.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad