Trending

6/trending/recent

Inter: ఇంటర్‌ పుస్తకాలకు ఇక క్యూఆర్‌ కోడ్‌

  • ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆన్‌లైన్‌లోనే వీడియో పాఠాలు 
  • ఈ ఏడాది నుంచి పుస్తకాలు పంపిణీ

Inter: నేటి ఆధునిక డిజిటల్‌ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీనిని ఏరంగంలో అయినా సమర్ధంగా ఉపయోగించుకున్నప్పుడు భవిష్యత్తుకు మరింత గట్టి పునాది పడుతుంది. కొవిడ్‌ నేపథ్యంలో డిజిటల్‌ సేవలు మరింత విస్తృతం అయ్యాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా అందించే వీడియో పాఠాలు ఇక పాఠ్యపుస్తకాల్లో లభ్యం కానున్నాయి. ఇప్పటికే ఈ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ సమర్ధంగా వినియోగించుకుంటోంది. పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్‌కోడ్‌ ముద్రించి దీక్షా యాప్‌ ద్వారా స్కాన్‌ చేసి  పాఠాలను వీడియో రూపంలో అందిస్తున్నారు.  ఇక నుంచి ఇంటర్‌ విద్యలో కూడా ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ ఏడాది పంపిణీ చేసే ఇంటర్‌ నూతన పుస్తకాలను క్యూఆర్‌కోడ్‌తో అందించనున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదివేవారు 45వేల మంది,  ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 54వేల మంది ఉన్నట్లు అంచనా. ఆయా గ్రూపులు ఎంచుకున్న విద్యార్థులకు తెలుగు అకాడమి ద్వారానే  ఏటా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. తెలుగు అకాడమి ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నందున అక్కడి నుంచే పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది పంపిణీ చేసే నూతన పుస్తకాల్లో క్యూఆర్‌కోడ్‌ను జతచేసి అందించనున్నారు. క్యూఆర్‌ కోడ్‌ పుస్తకాల్లో ప్రతి పాఠ్యాంశం మొదట్లో ఉంటుంది. దానిని నిర్ధేశించిన యాప్‌ ద్వారా స్కాన్‌ చేస్తే ఆ పాఠానికి  సంబంఽధించిన వీడియో పాఠాలు నిష్ణాతులైన అధ్యాపకుల వివరణలతో లభ్యం అవుతాయి. దీనివల్ల ఒకసారి పాఠం అర్ధం కాకుంటే ఎన్నిసార్తు అయినా విని అర్ధం చేసుకునే సౌలభ్యం ఉంది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad