Saturday, July 27, 2024
Education: సంపూర్ణ విద్యతోనే బాలలకు...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Education: సంపూర్ణ విద్యతోనే బాలలకు బంగారు భవిష్యత్

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

Education: బాల్యం నుండే సంపూర్ణ విద్యను అందించినప్పుడే చిన్నారుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవు తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూష ణ్ హరిచందన్ అన్నారు. సంపూర్ణ విద్య జీవితంలో శ్రేష్ఠత’ అనే అంశంపై ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాల యం శనివారం నిర్వహించిన అంతర్జాతీ య విద్యా సదస్సుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ రాజభవన్ నుండి పాల్గొన్న హరిచందన్ మాట్లాడుతూ, ఆలోచనాపరులు, తత్వవేత్తలు ఊహించినట్లుగా ఘోరమైన కరోనా మహమ్మారి శిధిలాల నుండి ఉద్భవించే ప్రపంచం చూసినప్పుడు ఇంతకు ముందు చూసిన అనుభవించిన ప్రపంచానికి భిన్నంగా మారుతుందన్నారు. సంపూర్ణ అభివృద్ధి సాధించిన పిల్లలు మేధో, మానసిక, శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సామర్థ్యాలను కలిగి ఉండటం ద్వారా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రాపంచిక విద్య చిన్నారులు ప్రపంచంలో తమ స్థానాన్ని ఎంచుకోవటానికి సహాయపడుతుంద న్నారు. ప్రస్తుత పరిస్థితులలో పిల్లలలో నెలకొంటున్న ఒత్తిడి, ఆందోళన వారిలో అనిశ్చితికి దారితీస్తుందని, వారు నిర్బంధ వాతావరణంలో పెరగటం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయ ని గవర్నర్ అన్నారు. భయం, ఆందోళన, అనిశ్చితి ఉన్న ఈ కాలంలో జీవితాన్ని ఇచ్చే విద్య అన్న అంశంపై దృష్టి పెడుతూ ఆధ్యాత్మిక, నైతి క విలువలను బోధించడం ద్వారా సమాజంలో దైవ త్వాన్ని వ్యాప్తి చేయడానికి బ్రహ్మ కుమారిస్ చేస్తున్న కృషిని ప్రశంసనీయమ న్నారు. కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ యుకీ, రాజ యోగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ సమన్వయకర్త బ్రహ్మ కుమారిస్ శైలు, బ్రహ్మ కుమారిస్ శాంతివన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ మృత్యుంజయ, బ్రహ్మ కుమారిస్ ఆస్ట్రేలియా జాతీయ సమన్వయకర్త చార్లెస్ హాగ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles