Trending

6/trending/recent

Curfew Update: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..! సండలింపులపై నేడు నిర్ణయం

Curfew Update:  ఏపీలో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించనున్నారా..? అలాగే నిబంధనల సడలింపుల విషయంలోనూ మినహాయింపులు ఇస్తారా..? నేడు వీటిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో కఠిన కర్ఫ్యూ మంచి ఫలితాలు ఇస్తోంది. దీంతో మరో వారం రోజుల పాటు కర్ఫ్యూను పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 10తో కర్ఫ్యూ గడువు ముగుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కర్ఫ్యూ కొనసాగించడమే మేలని ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఏపీలో కరోనా పరిస్థితులు.. కర్ఫ్యూ కొనసాగుతున్న తీరు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై సీఎం జగన్ ఇవాళ ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు.

ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల పరిస్థితిపై అధికారులు సీఎం జగన్ కు నివేదిక ఇస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీలో కరోనా కేసులు భాగానే కట్టడి అవుతున్నాయని.. మరింత అప్రమత్తంగా ఉంటే పూర్తిగా కట్టడి సాధించవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూను మరో వారం పాటు పొడిగించి.. సండలింపుల్లో కొన్ని మార్పులు చేయడం మేలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కర్ఫ్యూను పొడిగిస్తూనే నిబంధనల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తారని తెలుస్తోంది. అలాగే కర్ఫ్యూ సమయాన్ని కుదించే విషయంపైనే చర్చించే అవకాశం ఉంది.

ప్రస్తుతం  ఏపీలో కఠిన కర్ఫ్యూ ఫలితాలను ఇస్తోంది. వారం రోజుల కిందటి వరకు ప్రతి రోజూ 20 వేలకు పైగా మంది కరోనా బారిన పడే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి లో మార్పు కనిపించింది. నిలకడగా పది వేల లోపే కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఊహించిన స్థాయిలో తగ్గడం లేదు. 90కు అటు ఇటుగా నమోదవుతూనే ఉన్నాయి. అందుకే కర్ఫ్యూను మరింత కాలం పొడిగించడమే మేలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఆదివారం కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 8976 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1758339 కు చేరింది. ఇందులో 16,09,879 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,23,426 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

జిల్లాల వారిగా చూస్తే కేవలం రెండు జిల్లాల్లోనే వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1669 కేసులు నమోదు అవ్వగా.. చిత్తూరులో 1232 కేసులు నమోదయ్యాయి.వారం క్రితం పరిస్థితి చూస్తే ఐదు ఆరు జిల్లాల్లో 3 వేలకు అటు ఇటుగా కేసులు రిపోర్ట్ అయ్యేవి.. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 298 కేసులు నమోదయ్యాయి.

కఠిన కర్ఫ్యూకి తోడు.. వ్యాక్సినేషన్ కూడా జోరుగా సాగుతుండడంతో కరోనా కట్టడి అవుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ఫ్యూను మరింత కాలం పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad