Trending

6/trending/recent

Banks Privatization: మరో సంచలనం దిశగా కేంద్రం అడుగులు!.. ఎస్‌బిఐని కూడా ప్రైవేటీకరించబోతున్నారా?..

Banks Privatization: బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి సంచలన వార్తలు వినిపిస్తున్నాయి.

 ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాల సందర్భంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లలో వాటాను విక్రయించాలని యోచిస్తు్న్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ప్రైవేటీకరించబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ బ్యాంకులోని ప్రభుత్వ వాటాను కూడా విక్రయించాలని కేంద్రం భావిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగిందే.. ఎస్‌బిఐ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ప్రైవేటీకరణకు సంబంధించి నీతి ఆయోగ్ రెండు బ్యాంకుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇప్పుడు ఆ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును కూడా చేర్చినట్లు కథనాలు వస్తున్నాయి.

బ్యాంకుల వాటా ధర.. స్టాక్ మార్కెట్లో ఈ బ్యాంకుల వాటా ధర వివరాలు చూసినట్లయితే. సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల మార్కెట్ విలువ రూ .44,000 కోట్లు. ఇందులో ఐఓబి మార్కెట్ క్యాప్ రూ .31,641 కోట్లు. అయితే, నీతి ఆయోగ్‌ ప్రతిపాదనను ప్రస్తుతం పెట్టుబడుల (డిఫామ్‌), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (బ్యాంకింగ్ డివిజన్‌) విభాగాల్లో పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు పెట్టే ప్రక్రియలో ప్రైవేటీకరించబోయే ప్రభుత్వ రంగ బ్యాంకుల పేర్లను నీతి ఆయోగ్ కార్యదర్శుల కోర్ కమిటీకి సమర్పించింది. ప్రైవేటీకరణ కోసం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక భీమా సంస్థ పేర్లను ఎంపిక చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు అప్పగించింది. ఆ మేరకు ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రకటన 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లోనే చేశారు.

ఇదిలాఉంటే.. ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. నీతి ఆయోగ్ ప్రతిపాదనను పెట్టుబడుల (డిఫామ్), ఆర్థిక సేవల విభాగాలలో పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన తరువాత.. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీలు దీనిని పరిశీలిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, వ్యయ కార్యదర్శి, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి, న్యాయ కార్యదర్శి, ప్రభుత్వ సంస్థల విభాగం కార్యదర్శి, పెట్టుబడి మరియు ప్రభుత్వ ఆస్తి నిర్వహణ విభాగం (డిపామ్) కార్యదర్శి, పరిపాలనా విభాగం కార్యదర్శి, ఇతరులు ఇందులో పాల్గొననున్నారు.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. డిపామ్ ఈ ప్రతిపాదనను ఆర్థిక సేవల శాఖతో చర్చిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు అవసరమైన శాసన మార్పులపై చర్చిస్తుంది. ప్రస్తుతం బ్యాంకుల ప్రైవేటీకరణకు ఎంత సమయం పడుతుంది అనేది నిబంధనల మార్పులపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు ఆర్‌బిఐతో కూడా చర్చలు జరగాల్సి ఉంది. ఆ తర్వాతే పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకుంటారు.

ఏ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నారు..

ఇప్పటికే కొన్ని బ్యాంకులను విలీనం చేయగా.. విలీనం చేయని, పెద్ద బ్యాంకులపై నీతి ఆయోగ్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ బ్యాంక్, సింధ్ బ్యాంక్, యుకో బ్యాంక్ ఈ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad