Trending

6/trending/recent

Ban: ఆ సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లపై నిషేధం.. వాడితే కఠిన చర్యలే

Ban: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవాళ ఔను అన్నవి రేపు కాదు అనే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకూ అందరూ వాడిన ఆ సబ్బులు, షాంపూలు, డిజర్జెంట్లూ ఇక వాడొద్దనే ఆదేశం రావడంతో... ప్రజలు అప్రమత్తం అవుతున్నారు.

కరోనా లాక్‌డౌన్ నుంచి సోమవారం చాలా వరకూ మినహాయింపులు ఇచ్చి... అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం... అదే సమయంలో ఆ సబ్బులు, షాంపూలు, డిజర్జెంట్లను వాడొద్దంటూ... వాటిపై నిషేధం విధించింది. వేటికైతే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన ప్రమాణాలు ఉండవో... ఇకపై వాటిని ఢిల్లీ ప్రజలు స్టోర్ చెయ్యడానికీ, రవాణా చెయ్యడానికీ, అమ్మడానికీ, కొనడానికీ, వాడటానికీ వీలు లేదు. సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకంటే... యమునా నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకే. తాజ్ మహల్ పక్కన ఎంతో అందంగా ఒదిగిపోయే మమునా నది... ఇప్పుడు పొల్యూషన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నది ప్రక్షాళన పేరుకే తప్ప... కార్యరూపం దాల్చట్లేదు. 

యమునా నదిని బాగుచెయ్యాలంటే ఏం చెయ్యాలి అనే అంశంపై యమునా మానిటరింగ్ కమిటీ (YMC) ఒకటి ఏర్పడి... కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని జనవరిలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) ఆమోదించింది. ఇలా ఆదేశాలు జారీ చెయ్యండి అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. NGT చెప్పాక... కేజ్రీవాల్ సర్కార్ మాత్రం ఏం చేస్తుంది... సరే అంటూ... ఈ కొత్త ఆదేశం జారీ చేసింది. "సరికొత్త BIS ప్రమాణాలను నిర్ధారించని సబ్బులు, షాంపులు, డిజర్టెంట్ల అమ్మకం, స్టోరేజ్, రవాణా, మార్కెటింగ్‌ను నిషేధిస్తున్నాం" అని తెలిపింది. రవాణా లేదు కాబట్టి... ఇక వాడకమూ ఉండదు.

BIS ప్రమాణాలతో లేని బాతింగ్ సబ్బులు, బట్టల సబ్బులను వాడితే ఎంత ప్రమాదమో ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్యాంపెయిన్లు పెట్టండి అని NGT ఆదేశించడంతో... కేజ్రీ సర్కారుకు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇక ఇప్పుడు సిటీలోని స్థానిక సంస్థల సిబ్బంది, సివిల్ సప్లై అధికారులు, జిల్లా యంత్రాంగం... షాపులకు వెళ్లి ఆకశ్మిక తనిఖీలు చెయ్యాల్సి ఉంది. గోడౌన్లకు వెళ్లి పరిశీలించాల్సి ఉంది. ఎక్కడైనా తేడా కనిపిస్తే... యాక్షన్ తీసుకోలవాల్సి ఉంటుంది. తరచూ ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై అందరూ ఫోకస్‌గా ఉండాలి అని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) సోమవారం తన ఆదేశంలో చెప్పింది.

ప్రతి నెలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో రిపోర్ట్ ఇవ్వాలని DPCC కోరింది. దాన్ని బట్టీ నెక్ట్స్ ఏం చెయ్యాలో డిసైడ్ చేయనుంది. యమునా నది కాలుష్య బరితం అవ్వడానికి సబ్బులు, షాంపులు, సర్ఫులు, డిటర్జెంట్లే ఎక్కువ కారణం అని నిపుణుల బృందం తెలిపింది. చాలా సందర్భాల్లో నది నీటిపై నురగలు వస్తున్నాయి. అలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ఎన్నో.

నదిలో పాస్ఫేట్ ఎక్కువగా ఉండటం వల్లే నురగలు వస్తాయి. డైయింగ్ పరిశ్రమలు, ధోబీ ఘాట్లు, ఇళ్లలో వాడే సబ్బుల్లో ఉండే పాస్ఫేట్ నదిలోకి చేరుతోందని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (DPCB) తెలిపింది. ఢిల్లీలో ప్రమాణాలతో తయారుచేయని సబ్బులు, డిటర్జెంట్లూ చాలా ఉన్నాయి. ఐతే... పరిశ్రమల నుంచి కూడా పెద్ద ఎత్తున కాలుష్య వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. కరోనా సమయంలో వందల కొద్దీ శవాలను యమునా నదిలో పడేశారు. ఇలా నదిని ఎన్ని రకాలుగా నాశనం చెయ్యవచ్చో... అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారు. అందువల్లే యమునా ప్రక్షాళన కలగా మిగిలిపోతోంది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad